AP Anganwadi Workers Protest: రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన చేపడుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం దిగివచ్చి తమ సమస్యలు పరిష్కరించే వరకు తగ్గేదేలే అంటూ గత కొన్ని రోజులుగా వినూత్న రీతిలో నిరసనలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, వైసీపీ ఇంఛార్చుల నివాసాలను ముట్టడిస్తున్నారు. వేతనాల పెంపు, గ్రాట్యుటీ, పింఛను అమలు తదితర డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు.
Also Read: తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలపై సస్పెన్స్.. రిజర్వేషన్లు మారుతాయా?
ఈ క్రమంలోనే రాష్ట్ర మంత్రి జోగి రమేష్(Minister jogi ramesh) కు నిరసన సెగ తగిలింది. ఇబ్రహీంపట్నం లోని మంత్రి జోగి రమేష్ ఇంటిని అంగన్వాడీ కార్యకర్తలు ముట్టడించారు. తమ న్యాయమైన డిమాండ్ లను పరిష్కరించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేపట్టారు. కార్మిక సంఘాలు సీ ఐ టీ యు నేతృత్వంలో ఆందోళన బాట పట్టారు అంగన్వాడీ కార్యకర్తలు. ఎన్నికల ముందు సీఎం జగన్ తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: ఆర్జీవీని పెగ్గేసి పడుకోమన్న నాగబాబు.. అన్నదమ్ములు అడుక్కు తింటున్నారంటూ వర్మ కౌంటర్
తెలంగాణ కంటే రూ. వెయ్యి అదనంగా జీతం ఇస్తామని ఇప్పుడు మాట మారుస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు. కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతున్నారు. సమస్యలు పరిష్కరించేవరకు సమ్మె విరమించేది లేదని అంగన్వాడీ కార్యకర్తలు స్పష్టం చేస్తున్నారు.