Anupama Parameshwaran: మలయాళ కుట్టి అనుపమ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. తెలుగు, తమిళ్, మలయాళ చిత్రాలతో అలరించే ఈ బ్యూటీ మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.
Also Read: Gaami OTT Release : ఓటీటీలోకి మాస్ కా దాస్ సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
మలయాళ మూవీ ‘ప్రేమమ్’ తో ఫుల్ క్రేజ్ దక్కించుకున్న అనుపమ.. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలో వరుస అవకాశాలను అందుకుంది.
ఇటీవలే టిల్లు స్క్వేర్ సక్సెస్ తో ఫుల్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది ఈ బ్యూటీ. ఇప్పటివరకు పద్దతిగా, గర్ల్ నెక్స్ట్ డోర్ వంటి పాత్రల్లో కనిపించిన అనుపమ.. టిల్లు స్క్వేర్ తో రూట్ మార్చేసింది. గ్లామర్, నటనతో అందరినీ కట్టిపడేసింది.
సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ సూపర్ యాక్టీవ్ గా కనిపించే అనుపమ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలతో ఫ్యాన్స్ అలరిస్తూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.
టిల్లు స్క్వేర్ లో గ్లామర్ డోస్ పెంచిన ఈ బ్యూటీ.. తాజాగా సాంప్రదాయ వస్త్రాలంకరణలో దర్శనమిచ్చింది. గ్రీన్ కలర్ సారీ, ఒంటి నిండా నగలు, క్యూట్ స్మైల్ తో అందరి చూపులను తన వైపు తిప్పేసుకుంటుంది.
తెలుగులో కార్తికేయ 2, శతమానం భవతి, అఆ, హలో గురు ప్రేమకోసమే, 18 పేజెస్, సినిమాలు అనుపమకు మంచి గుర్తింపును తెచ్చాయి.
Also Read: Jr NTR: RTO కార్యాలయానికి జూనియర్ ఎన్టీఆర్.. అందుకోసమే వెళ్లారట..?