క్రికెట్లో అవుట్ అంటే వెంటనే గుర్తొచ్చిది బౌల్డ్, క్యాచ్, LBW, స్టంప్ అవుట్, రన్ అవుట్. క్రికెట్ చాలా కాలంగా చూసేవారికి కూడా అవుట్ ఇచ్చే రకాలు ఎన్నో తెలియకపోవచ్చు. కొంతమందికి మాత్రం తెలుసు. MCC క్రికెట్ లా హ్యాండ్ బుక్ కొంతమంది దగ్గర ఉంటుంది. వారికి వివిధ రకాల అవుట్స్‌పై అవగాహన ఉంటుంది. ఆ మధ్య ఐపీఎల్లో యూసఫ్ పఠాన్ ఉద్దేశపూర్వకంగా ఫీల్డ్‌ను అడ్డుకుంటే అవుట్ ఇచ్చారు. 20ఏళ్ల క్రితం పాకిస్థాన్ లెజెండరీ బ్యాటర్ ఇంజిమామ్ ఉల్ హక్కు కూడా ఇలానే అవుట్ ఇచ్చారు. ఇక ప్రస్తుత ప్రపంచకప్‌లో మరో టైప్ ఆప్ వికెట్‌ను అభిమానులు చూశారు. అదే ‘టైమ్ అవుట్.’
#BANvSL “Angelo Mathews”
what is this?#ICCCricketWorldCup #INDvSA #srilankacricketboard #srilankacricket #Angelomatthews #CricketWorldCup pic.twitter.com/60SxZ1cB6S— Wali creation 🇵🇸 (@ImrankhanPTI490) November 6, 2023
పాపం మాథ్యూస్:
ఢిల్లీ వేదికగా బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక మధ్య పోరులో ‘టైమ్ అవుట్’ ఘటన జరిగింది. విచిత్రమైన ఘటనలలో, శ్రీలంక ఆల్ రౌండర్ ఏంజెలో మాథ్యూస్(Angelo mathews) అవుట్ అయ్యాడు. శ్రీలంక బ్యాటింగ్ సమయంలో సమరవిక్రమ అవుటైన తర్వాత మాథ్యూస్ క్రీజులోకి వెళ్లాడు. అయితే అదే సమయంలో అతని హెల్మెట్ పట్టి విరిగిపోయింది. దీంతో దాన్ని రిప్లేస్ కోసం మాథ్యూస్ వెయిట్ చేశాడు. సమయం మూడు నిమిషాలు మించిపోయింది. అంటే సమరవిక్రమ అవుటైన తర్వాత మూడు నిమిషాలు దాటినా మాథ్యూస్ బంతి ఆడేందుకు సిద్ధంగా లేడు. దీంతో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అప్పీల్ చేశాడు. నిబంధనల ప్రకారం అంపైర్ అవుట్‌గా ప్రకటించాడు. ఈ విషయంపై ఆలోచించుకోవాల్సిందిగా మాథ్యూస్ బంగ్లాను కోరినా షకీబ్ రూల్ ఈజ్ రూల్.. ‘విత్ ఇన్ ది రూల్స్’ అని సమాధానం చెప్పినట్లు సమాచారం.
టైమ్ అవుట్ అంటే:
అంతర్జాతీయ క్రికెట్లో ‘టైమ్ అవుట్’ పద్ధతిలో పెవిలియన్‌కు చేరిన తొలి బ్యాటర్ మాథ్యూస్. దీంతో ఈ రూల్‌పై చర్చ జరుగుతోంది. నిబంధనల ప్రకారం, వికెట్ పడిపోయిన మూడు నిమిషాల్లో బౌలర్‌ను ఎదుర్కోవడానికి బ్యాటర్ సిద్ధంగా ఉండాలి. లేకపోతే టైమ్ అవుట్ ద్వారా బ్యాటర్‌ను అవుట్‌గా ప్రకటిస్తారు. MCC 40.1.1 నిబంధనల ప్రకారం ఇది అవుట్. ట్వంటీ 20 క్రికెట్ నియమాలు చట్టాల ప్రకారం 90 సెకన్లలోపు కొత్త బ్యాటర్ బంతని ఫేస్ చేసేందుకు రెడీగా ఉండాలి. మరోవైపు ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ క్రికెట్ స్ఫూర్తికి విరుద్దంగా ఆడిందని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. నిబంధనల ప్రకారం అవుటైనా.. ఇలా చేయకుండా ఉండాల్సిందని అభిప్రాయపడుతున్నారు.
Also Read: శ్రీలంక క్రికెట్ బోర్డు రద్దు…భారత్ చేతిలో పరాభవమే కారణం