Anganwadis Workers Protest: వారంతా పది రోజులుగా నిరసన చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. కానీ, ఇంతలోనే అందులోని మహిళకు సీఎం జగన్ పూనారట. ఇంకేముంది.. వేప కొమ్మలు పట్టుకుని ఊగిపోయారు. మీకేందుకు అధైర్యం.. నేనున్నానంటూ భరోసా ఇచ్చేసింది సీఎం జగన్ పూనిన మహిళ. నిరసన ఏంటీ.. జగన్ పూనడం ఏంటి? ఆని బుర్ర గోక్కుంటున్నారా? అయితే, పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిందే.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని సీఎం జగన్ను ప్రశ్నిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో అంగన్వాడీలు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. జగన్ పూనాడంటూ వినూత్న నిరసన తెలిపారు. జగ్గయ్యపేట పట్టణం తహసీల్దార్ కార్యాలయం వద్ద గత పది రోజులుగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు అంగన్వాడీలు. జగన్ పూనాడంటూ వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. పూనకంతో ఊగుతున్న మహిళను అంగన్వాడీలు.. ‘పాదయాత్రలో హామీలు ఇచ్చినావు కదా జగనన్న. ఈ రోజు నీ పుట్టినరోజు సందర్భంగా అంగన్వాడీ అక్క చెల్లెమ్మలకు జీతాలు పెంచే బటన్ నొక్కు’ అంటూ కోరారు. దీనికి స్పందించిన పూనకంతో ఊగిపోతున్న మహిళ.. ‘బటన్ నొక్కి మీ సమస్యలను పరిష్కరిస్తా.. పాలాభిషేకం చేయండి’ అంటూ సమాధానం ఇచ్చింది. అయితే, తమ సమస్యలను పరిష్కరించిన తరువాత అంగన్వాడీలందరం కలిసి నీకు పాలాభిషేకం చేస్తాం’ అంటూ సమాధానం ఇస్తూ వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు.
పల్నాడులో భిక్షాటన..
పల్నాడు జిల్లాలోని పెదకూరపాడులో అంగన్వాడీ కార్యకర్తలు భిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అంగన్వాడీల నిరసనలు కొనసాగుతున్నాయి. పరధాన రహదారులు, బస్టాండ్ వద్ద బిక్షాటన చేపట్టారు. ప్రభుత్వం మొండి వైఖరిని వీడి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు అంగన్వాడీలు. లేదంటే తమ సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలగొట్టడం దుర్మార్గం అని అన్నారు. 15 సంవత్సరాల నుంచి హెల్పర్లకు ప్రమోషన్ ఇస్తామని చెబుతూనే కాలం వెళ్ళదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అంగన్వాడీలు. రాష్ట్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా హామీ ఇచ్చేవరకు తమ పోరాటం కొనసాగుతుందని తేల్చి చెప్పారు.
Also Read:
ఆ విషయంలో సిద్దిపేట ఫస్ట్, గజ్వేల్ సెకండ్.. సీఎం రేవంత్ సంచలన కామెంట్స్..