Anasuya Bharadwaj breaks down on Instagram: బయటకు ఎంతో ఆనందంగా.. చలాకీగా.. హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ.. కొన్నిసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తలో నిలిచే యాంకర్ అనుసూయ వెక్కివెక్కి ఏడ్చింది. ఆమె ఏడుపు చూసిన హేటర్స్లో కొంతమంది పబ్లిసిటీ కోసం ఏడుస్తుందని కామెంట్లు చేయగా.. ప్రతి మనిషి బయట ఎంత హ్యాపీగా కనిపించినా లోపల మాత్రం ఎంతో బాధ పడుతుంటారని మరికొందరు అంటున్నారు. ఇది నిజమే.. డిప్రెషన్, బాధ అంటే సినిమాల్లో చూపించినట్టు హీరో మందు తాగి.. సిగరేట్లు ఒంటిపై కాల్చుకోవడం కాదు.. అందరిని నవ్విస్తూనే.. లోలోపల ఏడ్చేవాళ్లు చాలామందే ఉంటారు. సినీ సెలబ్రెటీలు అందుకు మినహాయింపు కాదు.
View this post on Instagram
అనుసూయ ఏం పోస్ట్ చేశారంటే?
అనుసూయ ఏడుస్తున్న పోస్ట్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఇన్‌స్టాలో ఈ విధంగా క్యాప్షెన్ పెట్టింది.. “ఈ పోస్ట్ ఉద్దేశ్యం ఏమిటంటే.. అన్ని ఫోజులు.. ఫొటోషూట్లు.. దాపరికాలు.. నవ్వులు.. డ్యాన్సులు.. స్ట్రాంగ్ కౌంటర్లు.. కమ్బ్యాకులు.. ఇలాంటివి చాలానే ఉన్నాయి. ఇవ్వని నా జీవితంలో ఒక భాగమే.. మీరు కూడా అలాగే ఉన్నారు.. కాబట్టి నేను మీతో అన్నింటినీ పంచుకుంటాను.. అలాగే నా జీవితంలోని అన్ని దశల్లోనూ నేను సంతోషంగా లేను.. బలంగా లేను.. చాలా బలహీనంగా ఉన్నాను.. చాలా బ్రేక్ డౌన్స్ ఉన్నాయి’ అంటూ రాసుకొచ్చింది అనుసూయ.
అందరిని కోరేది ఇదే:
జీవితంలో అందరికి చెడు రోజులు ఉంటాయని చెప్పింది అనుసూయ. అందుకే దయతో వ్యవహరించాలని కోరింది. చాలా మంది మైండ్‌సెట్ నీచంగా ఉంటుందని.. అలాంటి వారికి కొన్ని విషయాలు చెప్పకూడదని తెలిపింది. వారిని మనుషులను చేయాలని ప్రార్థించడం తప్ప చేయగలిగిందేమీ లేదని చెప్పింది. న్యూట్రల్‌గా ఉండటం, డిప్లొమాసి ఇలాంటివి తనకు తెలీదని.. తాను ఏమనుకుంటున్నానో అది చెప్పడమే తెలుసు అని చెప్పింది. తాను ఇప్పుడు పూర్తిగా బాగున్నానని క్లారిటీ ఇచ్చింది అనుసూయ.
View this post on Instagram
Also Read: ఘనంగా బ్రహ్మనందం కొడుకు వివాహ వేడుకలు!