Anasuya latest photos: యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అనసూయ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ.. తనకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ ఉంటారు.
తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా అనసూయ ఇన్స్టాగ్రామ్ వేదికగా తన తన ఫ్యామిలీతో కలిసి జిమ్ లో వర్క్ ఔట్ చేస్తున్న ఫోటోలను షేర్ చేశారు. ఈ ఫోటోను షేర్ చేస్తూ ఆమె ఒక క్యాప్షన్ కూడా రాశారు. కుటుంబం అనేది.. మన గతానికి సంబంధం.. భవిష్యత్తుకు వారధి. ఏదీ ఏమైనా నా ఫ్యామిలీతో గడపడానికి సమయం కేటాయించడం సంతోషంగా భావిస్తున్నాను. ఈ కొత్త రోజు.. కొత్త వారం.. కొత్త సంవత్సరాన్నీ ఇలా ప్రారంభించడం ఆనందంగా ఉందని తెలిపారు. ఇది తన న్యూ ఇయర్ రిసోల్యుషన్ అన్నట్లుగా చెప్పారు.
ఫ్యామిలీతో కలిసి న్యూ ఇయర్ పార్టీనీ ఎంజాయ్ చేశారు అనసూయ. దీనికి సంబంధించి తన పిల్లలు, భర్తతో కలిసి ఉన్న ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు.
అనసూయ జబర్దస్త్ షోతో ఫుల్ పాపులారిటీ సొంతం చేసుకుంది. ప్రస్తుతం అనసూయ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. రీసెంట్ గా సముద్రఖని నటించిన విమానం సినిమాలో సుమతి అనే ప్రధాన పాత్రలో నటించారు. అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 చిత్రంలో కూడా అనసూయ నటిస్తోంది.
సినిమాలు మాత్రమే ఈ బ్యూటీ వెబ్ సీరీస్ లో కూడా నటిస్తోంది. కన్యా శుల్కం వెబ్ సీరీస్ లో నటించనున్నారు. గురుజాడ అప్పారావు రాసిన క్లాసిక్ నాటకం ‘కన్యా శుల్కం’ ఆధారంగా ఈ వెబ్ సీరీస్ తెరకెక్కనుంది. ఈ సీరీస్ లో అనసూయ మధురవాణి అనే వేశ్య పాత్రలో కనిపించనున్నారని టాక్. డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రాన్ని నిర్మిస్త
Also Read: Anasuya Bharadwaj: ‘ఇంకొకసారి నా జోలికి రావద్దు’..అనసూయ స్ట్రాంగ్ వార్నింగ్.!