Anand Mahindra: ఆనంద్ మహీంద్రా.. నెటిజన్లకు పరిచయం అవసరం లేని పేరు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు మహీంద్రా అండ్ మహీంద్రా చైర్పర్సన్ అయిన ఆనంద్ మహీంద్రా(anand mahindra). ఎన్నో అద్భుతమైన విషయాలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. వాటిలో కొన్ని స్ఫూర్తి నింపేవి ఉంటే.. మరికొన్ని ఆలోచింపజేస్తాయి. ఇంకొన్ని నవ్వు కూడా తెప్పిస్తాయి.
Also Read: డిన్నర్ తర్వాత ఇలా చేయండి.. హ్యాపీగా నిద్రపోతారు!
That’s a bear startled by looking into a mirror for the first time. Frankly that’s my reaction to my reflection every time I get up too early on a sunday morning…. pic.twitter.com/TKm3WUWVGD
— anand mahindra (@anandmahindra) November 5, 2023
తాజాగా, నవ్వు తెప్పించే ఓ వీడియోను షేర్ చేశారు మహీంద్రా అండ్ మహీంద్రా చైర్పర్సన్ అయిన ఆనంద్ మహీంద్రా. అందులో ఓ ఎలుగుబండి అడవిలో ఓ చెట్టుకు ఉన్న పెద్ద అద్దాన్ని చూసి ఒక్కసారిగా షాకైంది. ఆ వెంటనే వెనక తనలాంటిదే ఇంకోటి ఉందేమోనని వెళ్లి చూసింది. అక్కడా కనిపించకపోవడంతో గాభరా పడింది. అద్దాన్ని పట్టుకుని చూసింది. దానిని బలంగా లాగడంతో అది కాస్తా కిందపడింది. ఈ వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా.. ఆదివారాల్లో మరీ ఉదయాన్నే లేచినప్పుడు తన రియాక్షన్ కూడా ఇలానే ఉంటుందని చెబుతూ నవ్వులు పూయించారు.