Amy Jackson w/d Ed Westwick : బాలీవుడ్ (Bollywood) నటి అమీ జాక్షన్ (Amy Jackson) రామ్ చరణ్ (Ram Charan) సరసన ‘ఎవడు’, ‘రోబో 2.O’, ‘నవమన్మదుడు’, చియాన్ విక్రమ్ ‘ఐ’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులలో ఫుల్ క్రేజ్ దక్కించుకుంది. ప్రస్తుతం తెలుగు చిత్రాలకు దూరమైన ఈ బ్యూటీ … తాజాగా వివాహం బంధంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు, హాలీవుడ్ యాక్టర్ ఎడ్ వెస్ట్విక్ ను వివాహం చేసుకుంది. వీరి పెళ్లి వేడుక ఇటలీ (Italy) లోని అద్భుతమైన అమల్ఫీ తీరంలోగ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఈ విషయాన్ని నటి అమీ జాక్సన్ సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేసింది. పెళ్లి ఫొటోలను షేర్ చేస్తూ.. ”ప్రయాణం మొదలైంది” అంటూ రాసుకొచ్చింది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు అమీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
అయితే అమీ జాక్సన్ కు ఇది రెండవ వివాహం. మొదట ఈ బ్యూటీ జార్జ్ పనయోట్టు అనే బిజినెస్మెన్తో 2019 లో ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఆ తర్వాత అతనితో ప్రేమ ప్రయాణం కొనసాగించిన అమీ పెళ్లికి ముందే బిడ్డకు జన్మనిచ్చింది. చివరికి 2022లో జార్జ్ పనయోట్టు తో విడిపోతున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత ఎడ్ వెస్ట్విక్ (Ed Westwick) ప్రేమలో పడిన అమీ.. అతనితో కలిసి వివాహ బంధంలోకి అడుగుపెట్టింది.
View this post on Instagram
Also Read: Shraddha Kapoor: ఇన్స్టాలో శ్రద్ధా రికార్డు.. 92.1 మిలియన్ ఫాలోవర్లతో సెకండ్ ప్లేస్ – Rtvlive.com