Amrutha Pranay Entry Into Movies: మనసుకి తగిలిన గాయాన్ని కాలమే మాన్పిస్తుందని మనందరికీ తెలిసినా కొన్ని గాయాలు మానడం అంత తేలికయిన పనేం కాదు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ అమృత ప్రణయ్ (Amrutha Pranay) ప్రేమ గాథ. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ ప్రేమకథలో ఎన్నో మజిలీలు. పెళ్లి అయిన తరువాత జీవితం ఎంతో హాయిగా సాగిపోతోన్న తరుణంలో ఎవరూ ఊహించని రీతిలో విషాదం చోటు చేసుకోవడం అందరినీ కలచి వేసింది. అమృత తరపువారి చేతిలో ప్రణయ్ దారుణ హత్య కు గురికావడం ..అలాంటి దారుణమైన సంఘటన జరిగిన సమయంలో అమృత మానసిక పరిస్థితి చూసిన వారందరి హృదయాలు కకావికలమయ్యాయి. కేవలం పరువు కోసం కన్న కూతురి జీవితాన్ని చిన్నాభిన్నం చేసిన తండ్రి కూడా ఇప్పుడు లేకపోవడం బాధాకరం. ఇదంతా,.. ఒక ఎత్తయితే.. అమృత ప్రణయ్ ల తీపి గుర్తుగా పుట్టున బాబు భవితవ్యం ఏంటి ? అనే ప్రశ్నయే అందరి మదిని తోలిచివేసింది.
కులాంతర వివాహాన్ని అంగీకరించని తండ్రి మారుతీ రావే .తన భర్త ప్రణయ్ ను హత్య చేయించాడని అమృత కేసు పెట్టింది. అయితే ఎవరూ ఊహించని విధంగా ఈ కేసు విచారణలో ఉన్న సమయంలోనే అమృత తండ్రి మారుతీరావు హైదరాబాద్లోని ఆర్యవైశ్య భవన్లో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. తండ్రిని చూసేందుకు వచ్చిన అమృతను కుటుంబ సభ్యులు బంధువులు అడ్డుకోవడంతో అమృత అక్కడి నుంచి వెనుతిరిగింది. అయితే .. తన తండ్రి ఆత్మహత్య చేసుకునే ముందు రాసిన లేటర్ లో తల్లి గిరిజ వద్దకు వెళ్లమని అమృతను కోరడంతో . . అప్పట్లో పోలీసుల రక్షణతో మిర్యాలగూడ లో ఉన్న తల్లి గిరిజను అమృత పరామర్శించడం కూడా జరిగింది .
ఏం చేస్తోందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
కాల చక్రం గిర్రున తిరుగుతోంది..ఆగదు ఏ నిమిషం నీ కోసమూ .. ఆగితే ముందుకు సాగదు ఈ లోకమూ .. సినీ కవి మాటలు అక్షర సత్యం. అమృతకు బాబు పుట్టాడు.
అటు ప్రాణంగా ప్రేమించిన కట్టుకున్నవాడిని. ఇటు ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకునే కన్న తండ్రిని పోగొట్టుకున్న అమృత ఇప్పుడు ఎం చేస్తోంది.?ఇప్పుడంతా ..డిజిటల్ ప్రపంచం. పైగా బీటెక్ చదువుకున్న తెలివైన అమ్మాయి. ప్రపంచం పరుగులు పెడుతోంది. జ్ఞాపకాలను తలచుకుంటూ అలానే కూర్చుంటే ఎలా ? రేపటి భవిష్యత్ ఏంటి ? ఇలాంటి ఆలోచనలనుంచి ఓ యూట్యూబ్ చానెల్ స్టార్ట్ చేసింది.అత్తవారితో కలిసి హైదరాబాదులో ఉంటున్న అమృత యూట్యూబ్ చానెల్ ను సమర్థవంతంగా నిర్వహిస్తోంది. అత్యధికంగా ఫాలోవర్స్ సొంతం చేసుకున్న ఈ ఛానల్ లో ప్రణయ్ జ్ఞాపకాలు, తన బాబు మెమరబుల్ మూమెట్స్, వంటకాలు, హోం టూర్స్ ను షేర్ చేస్తోంది. రీసెంట్ గా తన తల్లితో కలిసి ఉన్న వీడియో యూట్యూబ్ లో పోస్ట్ చేసి..ఆరేళ్ల తర్వాత అమ్మను కలిశానని చెప్పడం .. అమృత తల్లి కూడా సంతోషంగా కనిపించడం . అమృత కూడా చాలా హ్యాపీగా ఉండడంతో ఈ వీడియో చూసిన నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
వెండితెరపై ఎంట్రీ..?
ఇలాంటి టైం లో అమృత సినిమాలోకి ఎంట్రీ ఇస్తుందనే వార్త బలంగా వినిపిస్తోంది. వినిపించడమే కాదు పక్కాగా కనిపిస్తోంది. రీసెంట్ గా బెదుర్లంక 2012 మూవీ ప్రమోషన్లో పాల్గొని హీరో కార్తికేయ (Karthikeya) తో కలిసి డ్యాన్స్ చేసిన వీడియో ఇంస్టాలో పోస్ట్ చేసింది,.వెన్నెల్లో ఆడపిల్ల.. కవ్వించే కన్నెపిల్ల అంటూ రొమాంటిక్ యాంగిల్ లో చేసిన అమృత చేసిన డ్యాన్స్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.దీనితో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ప్రణయ్ ను పూర్తిగా మరచిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది సినిమాల్లోకి ఎంట్రీ ఎప్పుడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఒక్కటి మాత్రం నిజం ..అతిచిన్న వయసులోనే ఎన్నో కష్టనష్టాలకోర్చి రాటుదేలిన అమృత ముందు ముందు ఎలాంటి విజయాలు సాధిస్తుందో చూడాలి. ఏదేమయినా .. అన్నిటికి కాలమే సమాధానం చెప్పాలి..కాలానికున్న శక్తి అలాంటిది.