Good News For AP Farmers : ఏపీ అన్నదాతలకు అదిరిపోయే శుభవార్త. ఏంటో తెలుసా.. మీ బ్యాంక్ అకౌంట్లలోకి డబ్బులు జమ అవుతున్నాయి. దీంతో చాలా మంది రైతులకు ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. రైతుల కోసం ఖరీఫ్ – 2023(Khareef – 2023) కరవు సాయాన్ని ఏపీ ప్రభుత్వం(AP Government) తాజాగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనుంది. అంతేకాకుండా మిచౌంగ్ తుఫాను పంట నష్ట పరిహారాన్ని కూడా శనివారం నుంచి రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది.
ప్రభుత్వం దాదాపు 11.57 లక్షల మందికి రూ.1,289 కోట్లు అందించనుంది. ఖరీఫ్ రైతులకు రూ.847 కోట్లు లభిస్తాయి. ఇక మిచౌంగ్ బాధితులకు రూ.442 కోట్లు సాయం అందించనుంది. దీని వల్ల పంట నష్టం జరిగిన రైతులకు ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు.ఎన్నికల సంఘం (EC) ఆంక్షలు సడలించడంతో ప్రభుత్వం ఇప్పటికే ఆసరా, విద్యాదీవెన నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసింది. దీని వల్ల ఇప్పటికే విద్యార్థులకు, అటు డ్వాక్రా మహిలలకు ఊరట లభించబోతుంది.
ఇక జగన్ సర్కార్ చేయూత డబ్బులను కూడా మహిళల ఖాతాల్లో జమ చేయనుంది. త్వరలోనే ఈ మొత్తం కూడా లభించనుంది. ఇదే జరిగితే మహిళలకు చాలా ఊరట లభిస్తుంది. కాగా ఈ డబ్బులు ఎప్పుడో రావాల్సి ఉంది. కానీ వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు ఇంకొన్ని రోజుల్లో డబ్బులు బ్యాంకు ఖాతాల్లో పడనున్నాయి.
కాగా రైతులకు పీఎం కిసాన్ స్కీమ్(PM Kisan Scheme) కింద కూడా డబ్బులు రానున్నాయి. 17 వ విడత కింద రూ. 2 వేలు లభించనున్నాయి. జూన్ నెలలో లేదా జులై నెల తొలి వారంలో ఈ డబ్బులు లభించనున్నాయని నివేదికలు పేర్కొంటున్నాయి.మోదీ ప్రభుత్వం ఇప్పటికే 16 విడతల డబ్బులను రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది. అంటే రూ. 32 వేల డబ్బులు వచ్చాయి.
ఇప్పుడు కూడా రూ.2 వేలు వస్తే.. మొత్తంగా రూ. 34 వేల డబ్బులు వచ్చినట్లు అవుతుంది.కాగా పీఎం కిసాన్ డబ్బులు పొందాలని భావించే వారు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. కేవైసీ అప్డేట్ చేసుకోవాలి. అప్పుడే రూ. 2 వేల డబ్బులు బ్యాంక్ ఖాతాల్లోకి వస్తాయి. లేదంటే రాకపోవచ్చు.
Also read: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురి మృతి..మరో ఇద్దరి పరిస్థితి విషమం!