Amitabh Bachchan : బాలీవుడ్ మెగాస్టార్(Bollywood Megastar) అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) అస్వస్థత(Illness) తో ఆసుపత్రిలో చేరినట్లు సోషల్ మీడియా(Social Media) లో వార్తలు వైరలైన సంగతి తెలిసిందే. గుండెకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్న అమితాబ్.. యాంజియోప్లాస్టీ సర్జరీ కోసం ముంబై(Mumbai) లోని కోకిలాబెన్ హాస్పిటల్ చేరినట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న అమితాబ్ అభిమానులు కూడా ఆయన త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేశారు.
Also Read: Tamanna: రస్నా బ్రాండ్ అంబాసిడర్ గా తమన్నా.. వైరలవుతున్న యాడ్ షూట్
అదంతా ఫేక్ న్యూస్
అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేలిపోయింది. తాజాగా ఆయన ఆరోగ్యం పై వస్తున్న వార్తలను ఖండించారు అమితాబ్. శుక్రవారం థానేలోని దాదోజీ కొండదేవ్ స్టేడియంలో జరిగిన స్ట్రీట్ ప్రీమియర్ లీగ్(ISPL) ఫైనల్ మ్యాచ్ కు తన కొడుకుతో కలిసి హాజరయ్యారు అమితాబ్. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్యం గురించి మీడియా ప్రశ్నించగా క్లారిటీ ఇచ్చారు. తాను హాస్పిటల్ లో చేరినట్లు వస్తున్న న్యూస్ ఫేక్ అని.. అలాంటి వార్తలను ఎవరూ నమ్మవద్దని క్లారిటీ ఇచ్చారు. దీంతో బిగ్ బీ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.
View this post on Instagram
Also Read : Venkatesh Daughter’s Marriage : ఘనంగా వెంకటేష్ చిన్న కూతురి పెళ్లి.. వైరలవుతున్న ఫొటోలు