Amitabh Bachchan: ఎవర్ గ్రీన్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఈ రోజు 81వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ముంబైలోని బిగ్‌బీ నివాసం జల్సా వద్దకు అభిమానులు పెద్దఎత్తున చేరుకున్నారు. కేక్‌లు, ఇతర బహుమతులతో గేటు వద్ద ఎదురు చూస్తున్న అభిమానులకు బిగ్‌బీ ఇంటి బయటకు వచ్చి అభివాదం చేశారు. ఆయన పుట్టిన రోజుని ఫ్యాన్స్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు.
You can see #AishwaryaRaiBachchan, Navya and Aaradhya in the background proudly taking videos and video calling as @SrBachchan greets his numerous fans outside on his birthday eve. Happy birthday again sir, may there be many, many more to come! 🎉 pic.twitter.com/cNB8H1ea3G
— Bewitching Bachchans (@TasnimaKTastic) October 10, 2023
అమితాబ్ బచ్చన్ పరిచయం అవసరం లేని పేరు. బాలీవుడ్లో ట్రెండ్ సెట్ చేసిన లెక్కలేనన్ని సినిమాలు ఆయన లిస్ట్‌లో ఉన్నాయి. వయసుతో సంబంధం లేకుండా నేటి యువ నటులతో పోటీపడుతుంటారు అమితాబ్. ఎందరో ఫిలిమ్ స్టార్లకు బిగ్‌బీ ఒక మార్గదర్శి. ఈ వయస్సులోనూ అమితాబ్ హెల్తీగా, యాక్టివ్‌గా ఉంటారు. ఇప్పటికీ సినిమాలు, టి.వి షోలు చేస్తూ బీజీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ‘యాంగ్రీ యంగ్‌మేన్’గా పేరు తెచ్చుకున్న అమితాబ్ ఇప్పటికీ యంగ్‌మేన్‌లా యాక్టివ్గానే ఉంటారు. ప్రస్తుతం కౌన్‌బనేగా కరోడ్ పతి షూటింగ్లో పాల్గొంటున్న ఆయన.. టైగర్ ష్రాఫ్, కృతి సనన్ జంటగా నటిస్తున్న గణ్‌పత్ పార్ట్ వన్ లోనూ తళుక్కుమననున్నారు.
తాజాగా 81వ సంవత్సరంలోకి అడుగు పెట్టారు బిగ్‌బీ. ముంబైలోని బిగ్‌బీ నివాసం జల్సా వద్దకు అభిమానులు పెద్దఎత్తున చేరుకున్నారు. కేక్‌లు, ఇతర బహుమతులతో గేటు వద్ద ఎదురు చూస్తున్న అభిమానులకు బిగ్‌బీ సర్ప్రైజ్ ఇచ్చారు. ఇంటి బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేశారు. ప్రతి ఆదివారం తన నివాసం వద్ద అభిమానులను కలుసుకునే బిగ్‌బీ నేడు పుట్టినరోజు కావడంతో మరోసారి వారితో కలిసి తన సంతోషాన్ని పంచుకున్నారు.
కాగా, అమితాబ్ తన అభిమానులను కలిసేందుకు ఎప్పుడూ చెప్పులు లేకుండానే బయటకు వస్తారు. ఈ విషయమై ఆయన ఇటీవల నెట్టింట క్లారిటీ ఇచ్చారు. ‘‘అభిమానులను కలుసుకునేందుకు చెప్పులు లేకుండా రావాలా? అని నన్ను జనాలు తరచూ అడుగుతుంటారు. నేను గుడికి వెళ్లినప్పుడు చెప్పులు లేకుండానే వెళతాను. అలాగే, అభిమానులను చూసేందుకూ ఉత్తకాళ్లతో వస్తాను. అభిమానుల సమక్షమే నాకు దేవాలయం’’ అని ఆయన స్పష్టం చేశారు.
Also Read: నగ్నంగా ఊరేగించిన యువతి ఘటనలో అసలు ట్విస్ట్ ఇదే !!