Amit Shah Telangana Tour: కేంద్ర మంత్రి అమిత్ షా రేపు తెలంగాణకు రానున్నారు. ఎన్నికల షెడ్యూల్ (Telangana Election Schedule 2023) విడుదల తర్వాత ఆయన రాష్ట్రానికి తొలిసారి వస్తుండడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. రేపు ఆయన ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు. రాత్రి 7:40 గంటలకు ఐటీసీ కాకతీయలో ముఖ్యనేతలతో అమిత్ షా సమావేశం కానున్నారు. దాదాపు రెండు గంటల పాటు ఈ సమావేశం జరగనుంది. తాజా రాజకీయ పరిణామాలు, రాష్ట్రంలో పరిస్థితులపై ఈ సమావేశంలో చర్చించే అవకాశాలు ఉన్నాయి. 6.20 నుంచి 7.20 గంటల వరకు అమిత్ షా రాష్ట్రంలోని మేధావులతో భేటీకానున్నారు అమిత్ షా.
ఇది కూడా చదవండి: BJP: బీజేపీకి బిగ్ బూస్ట్.. ఈటల, కిషన్రెడ్డి అధ్వర్యంలో భారీ చేరికలు..!
బీఆర్ఎస్ అవినీతి మూకను తొలిగించడమే ధ్యేయం.. డబుల్ ఇంజిన్ సర్కారు తీసుకురావడమే లక్ష్యం..
ఆదిలాబాద్ జన గర్జన సభకు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ @AmitShah గారికి సాదర స్వాగతం.. pic.twitter.com/AxwDhomiZv
— BJP Telangana (@BJP4Telangana) October 9, 2023
రేపు అమిత్ షా (AmitShah) పర్యటన షెడ్యూల్ ఇలా ఉంది..
– మధ్యాహ్నం 1.45 కు బేగంపేట ఎయిర్ పోర్ట్ కు అమిత్ షా వస్తారు.
– అక్కడి నుంచి 02.35 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ లో ఆదిలాబాద్ కు..
– మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు ఆదిలాబాద్ లో మీటింగ్
– 4.15 కు ఆదిలాబాద్ నుంచి బేగంపేట ఎయిర్ పోర్ట్ కు..
– 5.05 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ కు..
– 05.20 నుంచి 6 వరకు ఐటీసీ కాకతీయలో సమావేశం
– 6:20 నుంచి 7:20 గంటల వరకు ఇంపీరియల్ గార్డెన్ కు..
– 7:40 నుంచి ఐటీసీ కాకతీయలో ముఖ్య నేతలతో సమావేశం
– 9.40 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి తిరిగి ఢిల్లీ వెళ్లనున్న షా