Bigg Boss Amar deep: బుల్లితెర ప్రేక్షకులను యాక్టర్ అమర్ దీప్ చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో జానకి కలగనలేదా సీరియల్ తో పాపులరైన అమర్.. బిగ్ బాస్ సీజన్ 7 లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు. మొదట్లో తన ఫౌల్ గేమ్ తో ప్రేక్షకుల్లో నెగిటివిటీ తెచ్చుకున్న అమర్.. ఆ తర్వాత తన ఆట తీరు మార్చుకొని సీజన్ 7 రన్నర్ అప్ గా నిలిచాడు. బిగ్ బాస్ తర్వాత మరింత క్రేజ్ దక్కించుకున్న అమర్.. ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు.
హీరోగా అమర్ దీప్ ఎంట్రీ
తాజాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. గురువారం పూజ కార్యక్రమాలతో సినిమాను అనౌన్స్ చేశారు. M3 మీడియా బ్యానర్ లో మహేంద్రనాథ్ కొండ్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రముఖ నటి సురేఖ వాణి కూతురు సుప్రీత హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో సుప్రీత టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. సీనియర్ హీరో వినోద్ కుమార్, నటుడు రాజా రవీంద్ర ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించనున్నట్లు తెలుస్తోంది.
హీరోయిన్ గా సుప్రిత
ఇక ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్న సుప్రీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా కనిపించే ఈ బ్యూటీ హాట్ ఫోటో షూట్స్ తో గ్లామర్ షో చేస్తూనే ఉంటుంది. సుప్రీత తన తల్లి సురేఖ వాణితో కలిసి చేసే వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంటాయి. ఇక ఎంతో కాలంగా టాలీవుడ్ డెబ్యూ కోసం ఎదురుచూస్తున్న ఈ బ్యూటీ ఈ సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయనుంది. అమర్ దీప్, సుప్రీత ఇద్దరికీ ఇది మొదటి సినిమానే కావడంతో.. వారి అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. గతంలో ఐరావతం, మ్యాన్షియన్ 24 వంటి ఓటీటీ చిత్రాలతో అలరించిన అమర్ దీప్ వెండి తెర పై ఏ విధంగా ఎంటర్ టైన్ చేయనున్నారో చూడాలి.
#AmarDeep as Hero. Film Launched Yesterday.
Heroine is #Supritha(SurekhaVani’s Daughter)
— BigBoss Telugu Views (@BBTeluguViews) February 2, 2024
Also Read: Chiranjeevi: పద్మ శ్రీ పురస్కార గ్రహితలను సత్కరించిన .. మెగాస్టార్ చిరంజీవి