Amala Paul Baby Shower Ceremony: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అమలాపాల్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరి సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. తెలుగు, తమిళ్, మలయాళ చిత్రాలు చేస్తూ బిజీగా సాగుతోంది. ఇటీవలే పృథ్వీరాజ్ సుకుమారన్ సరసన ‘ఆడుజీవితం’ మూవీలో కనిపించి ప్రేక్షకులను అలరించింది అమలాపాల్.
అయితే ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ తన ప్రెగ్నెన్సీ పీరియడ్ ను ఎంజాయ్ చేస్తోంది. గతేడాది నవంబర్ లో ప్రియుడు జగత్ దేశాయ్ (Jagat Desai) ను పెళ్లి చేసుకున్న ఈమె.. ఆ తర్వాత కొన్ని రోజులకు తన ప్రెగ్నెన్సీ విషయాన్ని షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ప్రెగ్నెన్సీ విషయం బయట పెట్టినప్పటి నుంచి బేబీ బంప్ ఫొటోలతో తన ప్రెగ్నెన్సీ కి సంబంధించిన విషయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటోంది ఈ ముద్దు గుమ్మ.
ఘనంగా అమలాపాల్ సీమంతం వేడుకలు
తాజాగా తన సీమంతం వేడుకలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. ఈ వేడుకల్లో భర్త జగత్ దేశాయ్ కలిసి ఉన్న క్యూట్ ఫొటోలను షేర్ చేస్తూ.. “ప్రేమానురాగాలతో కూడిన సంప్రదాయమైన సీమంతం వేడుక” అనే క్యాప్షన్ జోడించింది అమలాపాల్. గుజరాత్ లోని సూరత్ లో ఈమె సీమంతం వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి.
View this post on Instagram