Rahul Gandhi : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర(Bharat Jodo Nyay Yatra) బుధవారం కాన్పూర్ కు చేరుకుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్(Congress) కార్యకర్తలు నగరంలో పోస్టర్లు అంటించారు. అందులో రాహుల్ గాంధీని కృష్ణుడిగా(Lord Krishna), యూపీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్(Ajay Roy) ‘అర్జునుడు’గా కనిపిస్తున్నారు. రాహుల్ గాంధీ, అజయ్ రాయ్ రథంపై వెళుతున్నట్లు పోస్టర్లో కనిపిస్తోంది.
పోస్టర్లో గీతా శ్లోకం
”యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత్ అభ్యుత్థానాం ధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్” అంటూ కాంగ్రెస్ కార్యకర్తల పోస్టర్లో శ్రీమద్ భగవత్ భగవత్ గీతా శ్లోకం కూడా రాసి ఉంది. హిందీలో ఈ శ్లోకానికి అర్థం ‘ఎప్పుడైతే ధర్మాన్ని కోల్పోయి, అధర్మం పెరుగుతుందో, అప్పుడు నేను నా రూపంలో కనిపిస్తాను’ అని రాశారు.
#WATCH | Kanpur, UP: Congress workers put up posters showing Congress leader Rahul Gandhi as ‘Lord Krishna’ and UP Congress Chief Ajay Rai as ‘Arjun’ before the Bharat Jodo Nyay Yatra reaches Kanpur today pic.twitter.com/fzQt6fmcrk
— ANI (@ANI) February 21, 2024
‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ 39వ రోజు
కాంగ్రెస్ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ అమేథీ(Amethi), రాయ్ బరేలీ మీదుగా కాన్పూర్ చేరుకుంది. ఇదిలావుండగా, రాహుల్ గాంధీ తన ‘భారత్ జోడో న్యాయ యాత్ర’కు కొన్ని రోజులు విరామం తీసుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నెలాఖరులో బ్రిటన్లోని ప్రతిష్టాత్మక కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో రాహుల్ ఉపన్యాసం చేస్తారని, ఆపై కొన్ని ముఖ్యమైన సమావేశాలలో కూడా పాల్గొంటారని పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ బుధవారం తెలిపారు. 39వ రోజు భారత్ జోడో న్యాయ్ యాత్ర బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు కాన్పూర్లో ముగుస్తుంది.
ఫిబ్రవరి 24 నుంచి యాత్ర తిరిగి
ఫిబ్రవరి 22, 23 తేదీల్లో యాత్రకు విరామం ఉంటుందని జైరాం రమేష్ తెలిపారు. ఫిబ్రవరి 24వ తేదీ ఉదయం మొరాదాబాద్ నుంచి మళ్లీ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ప్రారంభమవుతుందని చెప్పారు. ఆ తర్వాత సంభాల్, అలీఘర్, హత్రాస్, ఆగ్రా జిల్లాల మీదుగా రాజస్థాన్లోని ధోల్పూర్లో ప్రయాణం ఆగుతుంది. జైరామ్ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం, భారత్ జోడో న్యాయ యాత్ర మరోసారి ధోల్పూర్ నుండి మార్చి 2 మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది.
దీని తర్వాత ఇది మోరేనా, గ్వాలియర్, శివపురి, గుణ, షాజాపూర్, ఉజ్జయినితో సహా మధ్యప్రదేశ్లోని ఇతర జిల్లాల మీదుగా సాగుతుంది. జనవరి 14న మణిపూర్ నుంచి ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ప్రారంభమైంది. వచ్చే నెలలో ముంబైలో ముగుస్తుంది.
Also Read : వాట్సాప్ లో కొత్త ఫీచర్..ఈసారి ప్రొఫైల్ ఫోటోకు సంబంధించి!