Movies: ఆగస్టు 15 న సినీ ప్రియులకు పండగే పండగ. ఆగస్టు 15న బాక్స్ ఆఫీస్ వద్ద సినిమాల సందడి ఉండబోతుంది. ఏకంగా 5 పెద్ద చిత్రాలు ఆగస్టు బరిలో పోటీ పడడానికి సిద్ధమయ్యాయి. పలు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ సూపర్ స్టార్స్ నటించిన ఈ సినిమాలు ఆగస్టు 15న విడుదల కాబోతున్నాయి. ఈ చిత్రాల లిస్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం
స్త్రీ 2
రాజ్‌కుమార్ రావు, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘స్త్రీ 2’ 2018 లో సూపర్ హిట్ గా నిలిచిన స్త్రీ సీక్వెల్ గా ఈ చిత్రం రాబోతుంది. అమర్ కౌశిక్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది.
డబుల్ స్మార్ట్
టాలీవుడ్ హీరో రామ్ పోతినేని మోస్ట్ అవైటెడ్ డబుల్ ఇస్మార్ట్ ఆగస్టు 15న ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్ర పోషించారు. 2019లో విడుదలైన ‘ఇస్మార్ట్’ చిత్రానికి సీక్వెల్ గా ఈ మూవీ రాబోతుంది.
మిస్టర్ బచ్చన్
హరీష్ శంకర్ దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్. పక్క కమర్షియల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది.
తంగలాన్
చియాన్ విక్రమ్ పీరియాడికల్ డ్రామా తంగలాన్ ఆగస్టు 15న విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన మూవీ ట్రైలర్ విపరీతమైన హైప్ క్రియేట్ చేసింది.
‘ఖేల్ ఖేల్ మే’
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఖేల్ ఖేల్ మే’. ఈ చిత్రానికి ముదస్సర్ అజీజ్ దర్శకత్వం వహించారు. అక్షయ్‌తో పాటు తాప్సీ పన్ను, వాణి కపూర్, అపర్శక్తి ఖురానా, అమ్మీ విర్క్, ఆదిత్య సీల్, ప్రగ్యా జైస్వాల్, ఫర్దీన్ ఖాన్ కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
వేద
నిఖిల్ అద్వానీ దర్శకత్వంలో జాన్ అబ్రహం, శర్వరీ బాగ్ జంటగా నటించిన చిత్రం ‘వేద’. ఈ సినిమాలో జాన్, శర్వరితో పాటు తమన్నా భాటియా కూడా నటిస్తోంది. ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: Kannappa: కన్నప్ప అప్డేట్.. కోయదొర పాత్రలో శరత్ కుమార్.. పోస్టర్ వైరల్..! – Rtvlive.com