African Union becomes permanent member of G20: ప్రపంచంలోని అత్యంత ధనిక, అత్యంత శక్తివంతమైన దేశాలతో కూడిన జీ20 (G20)లో ఆఫ్రికన్ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం లభించిందని భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన కూటమి శిఖరాగ్ర సమావేశంలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. 55 సభ్య దేశాలతో కూడిన కాంటినెంటల్ బాడీ అయిన ఆఫ్రికన్ యూనియన్ ఇప్పుడు యూరోపియన్ యూనియన్‌కు సమానమైన హోదాను కలిగి ఉంది. సమ్మిట్‌లో మోదీ తన ప్రారంభ ప్రసంగంలో, చైర్పర్సన్ అజాలి అసోమాని (Azali Assoumani) ప్రాతినిధ్యం వహిస్తున్న AUని శాశ్వత సభ్యునిగా జీ20 నేతల టేబుల్ వద్ద కూర్చోవాలని ఆహ్వానించారు.
Honoured to welcome the African Union as a permanent member of the G20 Family. This will strengthen the G20 and also strengthen the voice of the Global South. pic.twitter.com/fQQvNEA17o
— Narendra Modi (@narendramodi) September 9, 2023
జూన్‌లో మోదీ ప్రతిపాదన:
సమ్మిట్‌లో నిర్ణయించే ఇతర సమస్యలలో బహుళపక్ష సంస్థల ద్వారా అభివృద్ధి చెందుతున్న దేశాలకు మరిన్ని రుణాలు, అంతర్జాతీయ రుణ నిర్మాణ సంస్కరణలు, క్రిప్టోకరెన్సీపై నిబంధనలు, ఆహారం, ఇంధన భద్రతపై భౌగోళిక రాజకీయాల ప్రభావం ఉన్నాయి. సభ్యుల మధ్య పంపిణీ చేసిన 38-పేజీల ముసాయిదా ‘భౌగోళిక రాజకీయ పరిస్థితి’ పేరాను ఖాళీగా ఉంచింది. యుక్రెయిన్‌లో యుద్ధంపై లోతైన విభజనను ప్రతిబింబిస్తుంది. కానీ 75 ఇతర పేరాలు క్రిప్టోకరెన్సీలు, బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకులలో సంస్కరణలు వంటి అంశాలపై విస్తృత ఒప్పందాన్ని సూచించాయి .
G20 గతంలో 19 దేశాలు, యూరోపియన్ యూనియన్ను కలిగి ఉంది. దీని సభ్యులు ప్రపంచ GDPలో 85శాతం, ప్రపంచ వాణిజ్యంలో 75శాతం కంటే ఎక్కువ. ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతుల ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
మోదీ చొరవ:
కొన్ని సంవత్సరాలుగా మన దేశం గ్లోబల్ సౌత్, ముఖ్యంగా ఆఫ్రికన్ ఖండంలోని సమస్యలు, ఇబ్బందులు, ఆకాంక్షలను ఎత్తిచూపుతూ అక్కడి ప్రజల పక్షాన నిలిచింది. ముఖ్యంగా ఆఫ్రికన్ యూనియన్ను జీ20లో సభ్యదేశంగా చేర్చుకోవడాన్ని సమర్థించడంలో ప్రధాని మోదీ ఈ ప్రయత్నాల్లో ముందున్నారు. జూన్‌లో, న్యూఢిల్లీ సమ్మిట్ సందర్భంగా AUకి పూర్తి సభ్యత్వం ఇవ్వాలని కోరుతూ G20 దేశాల నాయకులకు లేఖ రాయడం ద్వారా మోడీ చొరవ తీసుకున్నారు. కొన్ని వారాల తర్వాత, ఈ ప్రతిపాదన శిఖరాగ్ర సమావేశానికి సంబంధించిన అధికారిక ముసాయిదా ప్రకటనలోకి ప్రవేశించింది. జూలైలో కర్ణాటకలోని హంపిలో సమావేశమైన మూడో G20 షెర్పాస్ సమావేశంలో ఈ చేరిక జరిగింది.