SeshEXShruti: టాలీవుడ్ యంగ్ హీరో అడివిశేష్ (Adivi Sesh) మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోగా సాగుతున్నారు. మేజర్, హిట్ 2 సినిమాలతో రెండు వరుస విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు ఈ యంగ్ హీరో. స్పై యాక్షన్, మిస్టరీ థ్రిల్లర్స్ మెప్పించిన అడివిశేష్ చాలా కాలం తర్వాత మంచి లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
#SeshEXShruti pic.twitter.com/j4ul0INhHg
— Adivi Sesh (@AdiviSesh) December 12, 2023
అడివి శేష్ సినిమాకు సంబంధించిన ఈ లేటెస్ట్ అప్డేట్ నెట్టింట్లో వైరల్ గా మారింది. “ప్రేమ, అంతకు మించి ఉన్న ఒక ప్రత్యేకమైన కథనంతో అడివిశేష్, శ్రుతిహాసన్ (Shruti Haasan) కలిసి వస్తున్నట్లు” చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. SeshEXShruti వర్కింగ్ టైటిల్ తో మేకర్స్ ఈ సినిమాను ప్రకటించారు. అడివిశేష్ హీరోగా, శ్రుతిహాసన్ కథానాయికగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి షానెల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు. షానెల్ డియో గూఢచారి, క్షణం వంటి సూపర్ హిట్ సినిమాలకు DOP పని చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియ యార్లగడ్డ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చాలా కాలం తర్వాత అడివి శేష్ మంచి లవ్ స్టోరీతో వస్తునందున ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు.
ఇటీవలే అడివిశేష్.. గూఢచారి 2 (Goodachari 2) షూటింగ్ ప్రారంభం అయినట్లు తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.
#SeshEXShruti@AdiviSesh and @shrutihaasan are joining hands to bring a unique story of love and beyond ❤️🔥
Produced by #SupriyaYarlagadda under @AnnapurnaStdios & co-produced by @AsianSuniel.
The film is Directed & Co-written by #ShaneilDeo.
More details soon! pic.twitter.com/EI6tHUAORW
— BA Raju’s Team (@baraju_SuperHit) December 12, 2023
Also Read: Goodachari 2 : అడివిశేష్ బ్లాక్ బస్టర్ సినిమా సీక్వెల్.. మొదలైన షూటింగ్..!