Adikeshava Movie Updates: మెగా హీరో వైష్ణవ్ తేజ్, మోస్ట్ బ్యూటీఫుల్ యాక్ట్రెస్ శ్రీలీల నటిస్తున్న సినిమా ‘ఆదికేశవ’. ఈ చిత్రం నవంబర్ 10న రిలీజ్ అయ్యేందుకు సిద్దమవుతుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ ని దసరా పండుగ నుంచే మొదలు పెట్టేశారు. హీరో హీరోయిన్లు పలు ఇంటర్వ్యూలు ఇస్తూ సందడి చేస్తున్నారు. అలాగే మరోపక్క సాంగ్స్ కూడా రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ రెండు సాంగ్స్ ఆడియన్స్ ముందుకు వచ్చి ఆకట్టుకున్నాయి.
Also read: మెగాస్టార్ కు విలన్ గా రానా?
ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం థర్డ్ సింగిల్ కి సంబంధించిన ప్రోమోను వదిలారు. హీరో .. హీరోయిన్ పై చిత్రీకరించిన ఈ డ్యూయెట్ ‘లీలమ్మో’ అంటూ సాగుతుంది. ప్రత్యేకంగా వేసిన సెట్లో జోరుగా హుషారుగా సాగే పాట ఇది. ఈ నెల 25వ తేదీన పూర్తి పాటను రిలీజ్ చేయనున్నారు. జోజు జార్జ్ .. అపర్ణ దాస్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. నాగవంశీ – సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి, శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వం వహించాడు. వైష్ణవ్ తేజ్ జోడీగా శ్రీలీల నటించిన ఈ సినిమాకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించాడు.
ఇది గ్రామీణ నేపథ్యంలో నడిచే కథ. ఒక క్వారీ తవ్వకాలకు అడ్డుగా ఉందనే ఉద్దేశంతో ప్రాచీన కాలంనాటి శివాలయాన్ని పడగొట్టడానికి ఒక బిజినెస్ మెన్ ట్రై చేస్తాడు. అందుకు అడ్డుపడిన ఆదికేశవకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనేది కథ. నవంబర్ 10వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది.