Asha Sharath: మలయాళ ఇండస్ట్రీలో మహిళా నటులపై జరుగుతోన్న లైంగిక వేధింపులకు సంబంధించి జస్టిస్ హేమా కమిటీ ఇచ్చిన రిపోర్ట్ సంచలనంగా మారింది. ఈ రిపోర్ట్ పై కేరళ ప్రభుత్వం ఉన్నతాధికారులతో కలిసి చర్చలు నిర్వహించారు. పలువురు మహిళా నటులు చెప్పిన వివరాలు, సాక్ష్యాల ఆధారంగా హేమా కమిటీ నివేదిక పై దర్యాప్తు చేసేందుకు సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది.
ఈ నేపథ్యంలో నటి రేవతి సీనియర్ నటుడు సిద్దిఖీ తన పై అత్యాచారం చేశాడంటూ చేసిన ఆరోపణలు ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేఫుతున్నాయి. ఈ ఆరోపణల కారణంగా సిద్ధిఖీ మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో తన జనరల్ సెక్రటరీ పదవికి కూడా రాజీనామా చేయడం జరిగింది. ఇది ఇలా ఉంటే సిద్దిఖీ.. నటి ఆశా శరత్ ను కూడా వేధింపులకు గురిచేశాడని వార్తలు రావడం నెట్టింట చర్చనీయాంశంగా మారింది.
సిద్దిఖీ ఆరోపణలను ఖండించిన ఆశా శరత్
అయితే తాజాగా నటి ఆశా శరత్ ఈ వార్తల పై స్పందించారు. నటుడు సిద్ధిఖీ తనను వేధించాడని చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. సిద్ధిఖీ తనకు మంచి స్నేహితుడని. తన పట్ల సిద్దిఖీ తప్పుగా ప్రవర్తించాడని వస్తున్న వార్తలను నమ్మవద్దని చెప్పింది. ‘దృశ్యం’ మూవీ షూటింగ్ సమయంలో సిద్దిఖీ నుంచి ఎలాంటి అనుచితమైన ప్రవర్తన, మాటలు గానీ ఎప్పుడూ ఎదుర్కోలేదని. తప్పుడు వార్తలు ప్రచారం చేసేవారు వెంటనే మానుకోవాలి. లేదంటే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపింది. అయితే సిద్ధిఖీ, ఆశా శరత్ మలయాళ ఫిల్మ్ ‘దృశ్యం’ లో కలిసి నటించారు.
Also Read: Malayalam Industry: మలయాళ సినీ ఇండస్ట్రీలో పెద్ద కుదుపు.. ఆ రిపోర్టుపై సిట్ ఏర్పాటు! – Rtvlive.com