Actor Ram and Director Boyapati’s Action Thriller Skanda: స్కంద చిత్రం సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. మరోవైపు సినిమా ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పుడీ సినిమా నుంచి మరో అప్ డేట్ వచ్చింది.సినిమా ప్రీ రిలీజ్ థండర్ వేడుకను ఆగస్ట్ 26న సెలబ్రేట్ చేయబోతున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన మరో పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్లో రామ్ (Ram), శ్రీలీల (Sree leela) కెమిస్ట్రీ బాగుంది. రామ్ పంచె కట్టులో కనిపిస్తే, శ్రీలీల చీరలో హోమ్లీగా ఉంది. పొలాల్లో కూర్చుని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ అందమైన చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తారిద్దరూ.
తమన్ (Thaman) ఈ చిత్రానికి సంగీతం అందించగా, మొదటి రెండు పాటలు సెన్సేషనల్ హిట్ అయ్యాయి. టైటిల్ గ్లింప్స్‌కి కూడా అద్భుతమైన స్పందన వచ్చింది. ప్రీ-రిలీజ్ థండర్ కూడా పెద్ద హిట్టవుతుందని భావిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా నుంచి వచ్చిన గందారబాయి సాంగ్ (Gandarabai Song) పెద్ద హిట్టయింది. రామ్, శ్రీలీల తమ ఎనర్జీతో ప్రేక్షకుల మనసుని కొల్లకొట్టారు.ఎక్స్ టార్డినరీ డ్యాన్స్ మూమెంట్స్ తో అలరించారు. రామ్ డ్యాన్స్‌లో డైనమిజం చూపించగా, శ్రీలీల తన ఎనర్జీతో మ్యాచ్ చేసింది. ఈ ఇద్దరు గ్రేట్ డ్యాన్సర్లు. నాటు నాటు సాంగ్ తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఈ సాంగ్ కు కొరియోగ్రఫీ అందించాడు.
శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై అత్యున్నత స్థాయి సాంకేతిక ప్రమాణాలతో భారీ బడ్జెట్‌తో శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సెప్టెంబర్ 15న ప్రపంచవ్యాప్తంగా స్కంద విడుదలకు సిద్ధమవుతోంది.
Also Read: ఓటీటీలోకి రెండు క్రేజీ సినిమాలు, వీకెండ్ సందడే సందడి