Jayaprada: నటి,రాజకీయ నాయకురాలు జయప్రద ‘పరారీ’లో ఉన్నారని ఉత్తరప్రదేశ్ లోని ప్రజాప్రతినిధుల కోర్టు ప్రకటించింది. 2019లో ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్టు జయప్రదపై రెండు కేసులు కోర్టు విచారణకు వచ్చాయి. ఈ విచారణలకు సంబంధించి జయప్రదపై ఏడుసార్లు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. అయినప్పటికీ ఆమె కోర్టుకు హాజరుకాలేదు.
ఈ నేపథ్యంలో, ప్రజాప్రతినిధుల కోర్టు జడ్జి శోభిత్ బన్సాల్ జిల్లా ఎస్పీకి ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు. పరారీలో ఉన్న జయప్రదను కోర్టులో హాజరుపరిచేందుకు ఓ స్పెషల్ టీమ్ ను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. మార్చి 6 లోపు ఆమెను కోర్టులో ప్రవేశపెట్టాలని స్పష్టం చేశారు.
జయప్రద గతంలో రాజ్యసభ ఎంపీగానూ, లోక్ సభ ఎంపీగానూ ఉన్నారు. అయితే రాంపూర్ నియోజకవర్గంలో అజమ్ ఖాన్ తో వివాదాల నేపథ్యంలో, సమాజ్ వాదీ పార్టీ నుంచి వైదొలగి 2019లో బీజేపీలో చేరారు. గత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.
Former MP and actress #JayaPrada has been declared to be “absconding” by a special court after she failed to appear for hearings for two cases against her.https://t.co/1Mdej0pTc0
— IndiaToday (@IndiaToday) February 27, 2024
ఇది కూడా చదవండి: ఈ వయస్సులో ఆ అలవాట్లు ఉన్నాయా? పళ్లు ఊడిపోతాయ్ జాగ్రత్త.!