Aadhaar Number: అక్టోబర్ నుండి, పాన్ దరఖాస్తు లేదా ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయడానికి ఆధార్ ఎన్రోల్మెంట్ నంబర్ చెల్లుబాటు కాదు. ఇప్పుడు దీనికి ఆధార్ నంబర్ మాత్రమే ఇవ్వాలి. ఎన్రోల్మెంట్ నంబర్ ఆధారంగా పాన్ చేసే సదుపాయం 2017 నుండి అమలులో ఉంది.
ఆధార్ ఎన్రోల్మెంట్ ID నుండి ఒకటి కంటే ఎక్కువ పాన్లను రూపొందించే అవకాశం ఉందనీ, అందుకే ఆ విధానాన్ని నిలిపివేస్తున్నామనీ ప్రభుత్వం చెప్పింది. ఆధార్ సంఖ్య కవరేజీ గణనీయంగా పెరిగిందని .. దాదాపు భారతదేశంలోని ప్రజలందరికీ ఆధార్ నెంబర్ లభించిందని ప్రభుత్వం నమ్ముతోంది. దీంతో ఐటీ రిటర్న్స్ కోసం తప్పనిసరిగా ఆధార్ నెంబర్ మాత్రమే ఇవ్వాలని స్పష్టం చేసింది.
ఆధార్ ఎన్రోల్మెంట్ ID అనేది ఆధార్ నంబర్ నుండి భిన్నంగా ఉంటుంది. ఇది 12-అంకెల వ్యక్తిగత గుర్తింపు సంఖ్య. ఇది భారతదేశ ప్రజలకు గుర్తింపు .. చిరునామాకు రుజువుగా పనిచేస్తుంది. అయితే ఆధార్ ఎన్రోల్మెంట్ ID (EID) అనేది 14 అంకెల సంఖ్య, ఇది ఆధార్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారునాకు తాత్కాలికంగా ఇవ్వడం జరుగుతుంది.
PAN కార్డ్ కోసం కనీస లేదా గరిష్ట వయో పరిమితి లేదు..
ఏ వయస్సులో ఉన్న వ్యక్తి అయినా లేదా వ్యక్తుల సమూహం, ట్రస్ట్, LLP, సంస్థ లేదా జాయింట్ వెంచర్ పాన్ కార్డ్ చేయడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి కనీస లేదా గరిష్ట వయోపరిమితి లేదు. దరఖాస్తు ఫారమ్‌తో పాటు అవసరమైన రుసుము .. రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్‌లతో పాటు నివాస ధృవీకరణ పత్రం .. గుర్తింపు ధృవీకరణ పత్రం అవసరం.
పాన్ కార్డ్ కోసం గుర్తింపు ధృవీకరణ పత్రం .. నివాస చిరునామా అవసరం..
పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు, గుర్తింపు ధృవీకరణ పత్రం .. నివాస చిరునామా ధృవీకరణ పత్రం రెండింటికీ సంబంధించిన పత్రాలను సమర్పించాలి. వ్యక్తిగత గుర్తింపు కార్డు కోసం ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి పత్రాలను ఉపయోగించవచ్చు. నివాస చిరునామా కోసం ఆధార్, ఓటర్ కార్డ్, ప్రభుత్వ బ్యాంకు పాస్‌బుక్ కూడా ఉపయోగించవచ్చు.