Actor Shivaji: గత కొంత కాలంగా తెలుగు ప్రేక్షకులకు కాస్త దూరమైన యాక్టర్ శివాజీ.. బిగ్ బాస్ సీజన్ 7 లో కంటెస్టెంట్ గా తిరిగి మళ్ళీ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. బిగ్ బాస్ తర్వాత మరింత పాపులరైన శివాజీ #90’s – మిడిల్ క్లాస్ బియోపిక్ తో సూపర్ హిట్ విజయాన్ని అందుకున్నారు. ఇటీవలే ఈటీవీ విన్ యాప్ లో రిలీజైన ఈ సీరీస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రాన్ని ఆదిత్య హాసన్ తెరకెక్కించారు. #90’s జనరేషన్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం ఉల్లాసకరమైన కామెడీతో, క్లీన్ ఫ్యామిలీ డ్రామాగా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా 90 s కిడ్స్ కనెక్ట్ అయ్యేలా ఉంది. ప్రస్తుతం ఈ సీరీస్ లోని, కామెడీ సీన్స్ సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి. ఓటీటీలో రిలీజైన ఈ సీరీస్ సూపర్ సక్సెస్ కావడంతో.. తాజాగా మేకర్స్ #90’s వెబ్ సీరీస్ సక్సెస్ మీట్ నిర్వహించారు.
Also Read: Pavan Kalyan: ట్రిపుల్ పవర్.. పవన్ నెక్స్ట్ సినిమా కాంబో చూస్తే పూనకాలే
సక్సెస్ మీట్
ఈ సందర్భంగా నటుడు శివాజీ కొన్ని ఆసక్తికర విషయాలు మాట్లాడారు. “నా కెరీర్ లో #90’s సీరీస్ మరుపురానిది. ఈ సీరీస్ ప్రేక్షకుల్లోకి అద్భుతంగా వెళ్ళింది. త్వరలోనే #90’s సినిమాలా రిలీజ్ చేస్తారని అనుకుంటున్నాను. దీనిలోని ప్రతీ చిన్న పాత్ర ఇంతలా ఆకట్టుకోవడానికి కారణం స్కిప్ట్. మంచి స్టోరీ దానికి తగిన ఆర్టిస్టులు దొరికినప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. సీరీస్ లోని ప్రతీ ఒక్కరు.. మౌలి, వాసుకి, రోహన్, వాసంతిక అద్భుతంగా నటించారు. ఓటీటీలు కూడా హిట్స్ ఇస్తాయని చెప్పడానికి #90’s నిదర్శనమని చెప్పారు. మంచి స్టోరీ, సంగీతం అందించిన ఆదిత్య హాసన్, సురేష్ బొబ్బిలికి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా ఈ సీరీస్ లో సాంప్రదాయినీ అనే ట్యూన్ ఫుల్ ట్రెండ్ అవుతోంది. #90’s ఇంత మంచి విజయాన్ని అందుకోవడం సంతోషంగా ఉందని మాట్లాడారు.
Also Read: Anudeep Movie : అనుదీప్ మూవీలో “సప్త సాగరాలు దాటి” .. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా