Missing : ఏలూరు (Eluru) జిల్లా అగిరిపల్లి(Agiripalli) మండలం సురవరం జిల్లా పరిషత్ హై స్కూల్ లో తొమ్మిదో తరగతి చదువుతూ కనిపించకుండా పోయిన ముగ్గురు విద్యార్థినుల(Missing 3 Students) ను పోలీసులు వెదికి పట్టుకున్నారు. మరికాసేపట్లో వారిని తల్లిదండ్రులకు అప్పగించనున్నట్లు పోలీసులు తెలిపారు. అసలేం జరిగిందంటే… బుధవారం ఉదయం పాఠశాలకు వెళ్లిన ముగ్గురు విద్యార్థినులు సాయంత్రం అయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో పాఠశాలకు చెందిన ఓ ఉపాధ్యాయున్ని విద్యార్థినుల తల్లిదండ్రులు వాకబు చేశారు.
ఆయన అసలు విద్యార్థినులు ఈరోజు పాఠశాలకు రాలేదని తెలిపాడు. దీంతో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ముగ్గురు విద్యార్థినులు కూడా మైనర్ బాలికలే. అంతే కాకుండా వారిలో ఒకరు ఇంటి నుంచి నగదు, సెల్ ఫోన్ కూడా తీసుకుని వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సీఐ రామకృష్ణ నేతృత్వంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి విద్యార్థినుల కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు. ముగ్గురిలో ఒకరి వద్ద సెల్ఫోన్ ఉండడంతో సిగ్నల్స్ ద్వారా లొకేషన్ ను పట్టుకున్న పోలీసులు.
నిన్న అర్ధరాత్రి దాటిన తరువాత ప్రకాశం జిల్లా(Prakasam District) లో విద్యార్థినులను గుర్తించిన పోలీసు అధికారులు. మరికాసేపట్లో బాలికలను తల్లిదండ్రులను అప్పగించనున్న పోలీసు అధికారులు. విద్యార్థినులు దొరకడంతో తల్లిదండ్రులు , ఉపాధ్యాయులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Also Read : మరో 9 మంది అభ్యర్థులకు పచ్చ జెండా ఊపిన పవన్!