Tech News: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ అయిన శాంసంగ్…త్వరలోనే భారత మార్కెట్లో సరికొత్త ఫోన్ను లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 15 5జీ ఫోన్ను వచ్చేనెల 4వ తేదీన ఆవిష్కరించనున్నట్లు వెల్లడించింది. మీడియాటెక్ డైమెన్సిటీ 6100ప్లస్ ఎస్వోపీ చిప్ సెట్ ప్రాసెసర్ తోపాటు మూడు కలర్స్ లో ఈ ఫోన్ లాంచ్ కానుంది. యాష్ బ్లాక్, గ్రూవీ, వయోలెట్, జాజీ గ్రీన్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 15 5జీ ఫోన్ యూఎస్బీ సీ ఛార్జింగ్ పోర్ట్ ద్వారా 25వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుది. నాలుగేళ్ల పాటు ఆండ్రాయిడ్, ఐదేళ్ళపాటు సెక్యూరిటీ అప్ డేట్స్ ను అందిస్తుంది. శాంసంగ్ గెలాక్సీ ఏ 15కంటే తక్కువ ధరకే శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 15 5జీ ఫోన్ లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఈ కామర్స్ ఫ్లాట్ ఫాం ఫ్లిప్ కార్ట్ ద్వారా విక్రయించనున్నారు.
Samsung Galaxy F15 5G
Expt Specs:
6.5″ FHD+ 90Hz sAMOLED
Mediatek Dimensity 6100+
50MP + 5MP + 2MP
13MP
6000mAh`25W Charging
4 Years of Software Updates!
Launch date in india 4 March by @Flipkart #SamsungGalaxyF155G#F155G #SamsungF155G pic.twitter.com/VyZkFAoQ4F— TMKTECH (@tmktechfamily) February 25, 2024
సూపర్ ఆల్మోడ్ డిస్ ప్లే, ఓక్టాకోర్ మీడియా టెక్ డైమెన్సిటీ 6100ప్లస్ చిప్ సెట్ ప్రాసెసర్ తో వస్తుంది. శాంసంగ్ ఎఫ్ 15 5జీ ఫోన్ సింగిల్ ఛార్జింగ్ తోపాటు రెండు రోజుల బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. ఈఫోన్ 50మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరాతోపాటు ట్రిపుల్ రేర్ కెమెరా యూనిట్, సింగిల్ సెల్ఫీ షూటర్ పై వాటర్ డ్రాప్ స్టైల్ డిస్ ప్లేను కలిగి ఉంటుంది. ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు బ్యాక్ గ్రౌండ్ నాయిస్ రాకుండా వాయిస్ ఫోకస్ అనే ఏఐ ఫీచర్ వాడారు. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 15వేల లోపు ఉంటుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: మీకు బైక్ ఉందా? అయితే ఆ స్కీం కట్..మీరు ఆ లిస్టులో ఉన్నారో లేదో చెక్ చేసుకోండి.!