మీరు మొదటిసారి ఓటు హక్కు పొందారా? తొలిసారిగా ఓటు ఎప్పుడెప్పుడు వేయాలని ఆశగా ఎదురుచూస్తున్నారా? అయితే మీకు ఎన్నికల కమిషన్ హెచ్చరిక జారీ చేసింది. ఓటు వేయాలన్న ఉత్సాహం, ఓటు వేసిన సంతోషంలో పోలింగ్ బూత్ ల దగ్గర హడావుడి చేసి సెల్ఫీలు తీసుకుని వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేసే వారిని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ పోలింగ్ కేంద్రాల దగ్గర సెల్ఫీలు తీసుకోవద్దని..అలాంటి చర్యలకు పాల్పడితే అరెస్ట్ చేస్తామంటూ అధికారులు గట్టి వార్నింగ్ ఇచ్చారు.
ఓటు వేశాక…ఆ పని చేస్తే అరెస్టు తప్పదు:
నేడు ఉదయం 7గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్ల ఇప్పుడిప్పుడే పోలింగ్ స్టేషన్లకు చేరుకుంటున్నారు. కొత్తగా ఓటు హక్కు పొందిన వాళ్లతో పాటు తొలిసారిగా ఓటు వేస్తున్న వారిలో కొంత అత్యుత్సాహం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాంటి వారికి పోలీసులు, ఎన్నికల అధికారులు వార్నింగ్ ఇస్తున్నారు. ఓటు వేసిన తరవ్ాత తాము ఓటు వేశామంటూ అందరికీ చెప్పుకుంటూ పోలింగ్ స్టేషన్ల వద్ద సెల్ఫీలు తీసుకుని వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసే అలవాటు చాలా మందికి ఉంటుంది. అయితే ఈ సారి అలాంటివి కుదరదని అధికారులు గట్టిగా చెబుతున్నారు.
ఓటు వేసిన తర్వాత పోలింగ్ కేంద్రం దగ్గర సెల్ఫీలు దిగినా…లేదంటే ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు వచ్చే VVVIPలు, సినీ స్టార్లతో సెల్ఫీలు ఫొటోలు తీసుకునే ప్రయత్నం చేయరాదని ఈసీ గట్టిగా చెప్పింది. పోలింగ్ కేంద్రాల్లోకి ఓటు వేసేందుకు వెళ్లేవారు స్మార్ట్ ఫోన్లు తీసుకెళ్లకూడదని…ఈసీ ఈ కొత్త కండీషన్ పెట్టింది. ఈసీ పెట్టిన ఈ కండీషన్ కొత్త ఓటర్లతోపాటు సెల్ఫీ ప్రియులకు ఒక్కింత షాకిచ్చినట్లైంది. అయితే ఓటు వేసిన సెల్ఫీలతో ప్రజల్లో అవగాహన పెరిగి ఓటు వేసే వారి సంఖ్య పెరగడం కంటే కేంద్రాల వద్ద వచ్చే సమస్యే ఎక్కువగా ఉంటుందని ఈసీ ఈ విధమైన ఆంక్షలను విధించింది.