Lok Sabha Elections 2024 : ‘ భారత్ మండపంలో జరిగిన బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశంలో రానున్న లోకసభ ఎన్నికలకు ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ పేరుతో రూపొందించిన ప్రచారగీతాన్ని విడుదలచేశారు. సమ్మళిత అభివృద్ధి థీమ్ రూపొందించిన ఈ పాటను కేవలం హిందీలోనే కాకుండా దేశవ్యాప్తంగా 24 భాషల్లో రిలీజ్ చేశారు. ఈ పాటలో ఎన్డీయే సర్కార్ తీసుకువచ్చిన పథకాలు, అంతర్జాతీయంగా భారత్ సాధించిన ఘనతలతోపాటు దేశంలోని పలు రంగాల్లో, ప్రాంతాల్లో, పలు సమూహాల్లో, సమాజంలోని వర్గాల్లో డెవలప్ మెంట్ ను హైలెట్ చేశారు.
మరోసారి మోదీ సర్కారు
Phir Ek Baar Modi Sarkar#PhirEkBaarModiSarkar pic.twitter.com/8qgEEKvWky
— BJP ANDHRA PRADESH (@BJP4Andhra) February 18, 2024
రైతులు, అసంఘటిత కార్మికులు, మహిళలు, యువత కోసం మోదీ సర్కార్ కృషి, దేశంలో అపూర్వమైన మౌలిక సదుపాయాలను ఆర్ధిక, చంద్రయాన్ 3, రామమందిర నిర్మాణం వంటి అసమానమైన విజయాలను కూడా ఈ పాటలో ప్రస్తావించారు. ఈ ఎన్నికల సందర్భంగా www.ekbaarphirsemodisarkar.bjp.org వెబ్సైట్ను కూడా ప్రారంభించింది. దీనిలో ఇప్పటికే 30లక్షల మందికిపైగా పౌరులు రాబోయే ఎన్నికల్లో మోదీ, బీజేపీకి ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
ఇది కూడా చదవండి: చెరుకు రైతులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్ ..కొనుగోలు ధరలు పెంపు..కొత్త ధరలు ఇవే..!!