Guntur Kaaram :సంక్రాంతి సినిమాల ఘాటు మొదలయింది. సూపర్ స్టార్ (Mahesh babu)మహేష్ బాబు, త్రివిక్రమ్ (Trivikram) కాంబోలో తెరకెక్కిన గుంటూరుకారం జనవరి 12 ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజై పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఓ వైపు హనుమాన్ , మరో వైపు గుంటూరు కారం సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ప్రతాపం చూపిస్తున్నాయి. మహేష్ బాబు కెరీర్ లోనే అత్యధిక షో స్ ప్రదర్శింపబడుతున్న చిత్రంగా గుంటూరు కారం సినిమా ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది. అన్ని షోస్ హౌస్ ఫుల్స్ తో ఎక్కడ చూసినా మహేష్ మ్యానియా కొనసాగుతోంది.ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం ఈ గుంటూరు కారం చిత్రాన్ని థియేటర్లో చూసి ఎంజాయ్ చేసాడు.
సుదర్శన్ 35 ఎంఎం థియేటర్ లో మహేష్ బాబు
అసలే సంక్రాంతి సీజన్ .. సూపర్ స్టార్ సినిమా . థియేటర్స్ దగ్గర జాతరే జాతర. ఇలాంటి పరిస్థితుల్లో గుంటూరు కారం చిత్ర యూనిట్ థియేటర్ కు సినిమా చూడటానికి వస్తే .. ఇక.. ఉంటుందండి .. మాములుగా ఉండదు. సరిగ్గా అదే జరిగింది,.హైదరాబాద్ లోని సుదర్శన్ 35 ఎంఎం థియేటర్లో మహేష్ బాబు తన ఫ్యామిలీ మెంబర్స్ తో , ఫ్యాన్స్ తో సినిమాను చూడటం జరిగింది. తమ అభిమాన హీరో తమతో పాటు సినిమా చూడటంతో ఫ్యాన్స్ చాలా ఎక్సయిట్ అయ్యారు,
పవర్ ఫుల్ యాక్షన్ ప్యాకేజ్
మహేష్ బాబు కు జోడీగా శ్రీలీల, మీనాక్షి చౌదరి నటించిన ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ . శ్రీలీల స్టెప్పులు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.మహేష్ బాబును ఊరమాస్ యాంగిల్ చూపించిన త్రివిక్రమ్ యాక్షన్ తో పాటు బావోద్వేగాలను సైతం మిళితం చేసి పవర్ ఫుల్ యాక్షన్ ప్యాకేజ్ అందించారని త్రివిక్రమ్ ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇంకా.. ఈ మూవీలో రమ్యకృష్ణ పొలిటికల్ లీడర్ గా అందరిని లరిస్తోంది. ఈ మూవీలో ప్రకాష్ రాజ్, రావు రమేష్, ఈశ్వరి రావు, జగపతి బాబుల పెర్ఫార్మెన్స్ వేరే రేంజ్ లో ఉంది.త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ ఉంటూనే ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేవిధంగా తీర్చిదిద్దారు. ఇప్పటికే గుంటూరు కారం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా .. ఓవర్సీస్ లో సైతం దుమురేపుతోంది.
వసూళ్ల రికార్డులు
అతడు , ఖలేజా చిత్రాల తరువాత దాదాపు 12 ఏళ్ల తరువాత త్రివిక్రమ్ – మహేష్ కాంబోలో వచ్చిన గుంటూరు కారం చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ సైతం భారీగా జరిగినట్లు సమాచారం. ఈ సీజన్లో టికెట్ ధరలు కూడా పెంచడంతో అతితొందరలోనే వసూళ్ల రికార్డులు కొల్లగొట్టే అవకాశం ఉంది.దిల్ రాజు(Dil Raju)పంపిణి చేసిన ఈ చిత్ర సక్సస్ మీట్ అతి తొందరలోనే పెట్టె అవకాశం ఉంది.
ALSO READ:HanuMan Movie Highlights: హనుమాన్ మూవీలో హైలెట్స్ అవే !!