Hyderabadi Kunda Biryani : బిర్యానీ (Biryani) పేరు చెప్పగానే ఎవరికైనా నోరూరిపోతుంది. అలాంటి బిర్యానీ తినాలంటే వందల రూపాయాలు వెచ్చించాల్సి వస్తుంది. కానీ పసందైన బిర్యానీ కేవలం రూ. 2 కే (2 rupees) ఆస్వాదించవచ్చు అంట. ఈ ఆఫర్ ఇస్తుంది మరెవరో కాదు…హైదరాబాద్ లో ఫేమస్ నాయుడిగారి కుండ బిర్యానీ (Naidu Gari Kunda Biryani) యాజమాన్యం. కానీ ఇక్కడ ఓ మెలిక పెట్టారు నిర్వాహకులు.
ఏ మెలిక లేకుండా రూ.2 లకే బిర్యానీ ఎలా తినేద్దాం అనుకున్నారు మరి. ఇంతకీ ఆ మెలిక ఏంటో తెలుసా..రూ. 2 నోట్ ని తీసుకుని వచ్చిన వారికి మాత్రమే ఈ అవకాశం అంటూ రెస్టారెంట్ నిర్వాహకులు తెలిపారు. 2 రూపాయాల నోట్ ఇవ్వండి మీకు నచ్చిన వెజ్ కానీ, నాన్ వెజ్ బిర్యానీ కానీ తిని వెళ్లండి అంటూ ఊరిస్తుంది.
నగరంలో నెల రోజుల కిందట ఈ రెస్టారెంట్ ని ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఆఫర్ ప్రకటించినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు రూ. 2 నోట్లు 120 వచ్చాయని వివరించారు. ప్రజల వద్ద రూ. 2 నోట్లు ఉన్నాయా? లేదా తెలుసుకునేందుకు ఈ ఆఫర్ని ప్రారంభించామని దీనికి విశేషమైన స్పందన వస్తుందని యాజమాని మనోహర్ అన్నారు. కేపీహెచ్బీ, గచ్చిబౌలి, దిల్సుఖ్నగర్లలో ఉన్న బ్రాంచీలలో ఈ ఆఫర్ వర్తిస్తుందని యాజమాన్యం పేర్కొంది.
నాయుడిగారి కుండ బిర్యానీ ఇలాంటి ఆఫర్లు ప్రకటించడం ఇదేమి మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా 30 కంటే ఎక్కువ వెరైటీలు ఉన్న బాహుబలి థాలీ తినాలని భోజన ప్రియులకు సవాల్ విసిరింది. అరగంటలోనే ఈ థాలీని తింటే కనుక లక్ష రూపాయలు అందిస్తామని తెలిపింది. ఈ ఛాలెంజ్ ఇప్పటి వరకు ఏడుగురు విజయం సాధించారు.
హైదరాబాద్ అంటేనే బిర్యానీకి చాలా ఫేమస్. బిర్యానీ లవర్స్ ని దృష్టిలో పెట్టుకుని పలు రెస్టారెంట్లు సైతం ఆఫర్లను సైతం ఇస్తున్నాయి.
Also read: గూగుల్లో ఎక్కువగా వెతికింది ఈ ముద్దుగుమ్మ కోసమేనట!