దాదాపు పుష్కర కాలం తరువాత సూపర్ స్టార్ రజినీ కాంత్ (Rajini kanth) జైలర్ (Jailor) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. జైలర్ మూవీ భారీ విజయం సాధించి 600 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ (600 crores )వసూలు చేసింది. ఈ సారి సంక్రాంతికి లాల్ సలాం మూవీతో రజినీ రానున్నారు. అయితే ఈ చిత్రంలో రజినీ కనిపించేది చాలా తక్కువ సేపు అని చిత్ర బృందం ఇది వరకే తెలిపింది.
దీంతో రజినీ అభిమానులు అంతా కూడా తలైవర్ 170 సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. రజినీ నటించే 170 వ సినిమాని జ్ఙానవేళ్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరొక అప్డేట్ బయటకు వచ్చింది.
Also read: ఢిల్లీని వణికించిన భూకంపం!
తాజాగా ఈ సినిమాలో రానా దగ్గుబాటి కూడా నటించనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా తెలిపారు. ఈ అనౌన్స్ మెంట్ తో అంతా షాక్ అయ్యారు. రానా ఇప్పటి వరకు హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. ఇప్పుడు ఏకంగా రజినీ కాంత్ సినిమాలో ఆయన అవకాశం దక్కించుకోవడంతో రానాకి అభిమానులు, సినీ ప్రముఖులు కంగ్రాట్స్ చెబుతున్నారు.
అంతేకాకుండా తలైవర్ 170 సినిమాలో ఇంకా కొంతమంది స్టార్లు ఉండబోతున్నట్టు సమాచారం.ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం, మంజూ వారియర్, రితికా సింగ్, దుషారా విజయన్ కథానాయికలుగా నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం నుంచి మరో బిగ్గెస్ట్ అప్డేట్ వచ్చింది.
అలాగే ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో పాటు, పుష్ప సినిమాలో పోలీసు ఆఫీసర్ గా నటించిన ఫహాద్ ఫాజిల్ కూడా ఉన్నట్లు సమాచారం. అయితే ఈ విషయం గురించి ఇప్పటి వరకు చిత్ర బృందం నుంచి ఎటువంటి అధికార ప్రకటన రాలేదు. ఈ చిత్రంలో రజినీ రిటైర్డ్ అయిన పోలీసు ఆఫీసర్ గా కనిపించబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
The dapper & supercool talent 😎 Mr. Rana Daggubati ✨ on board for #Thalaivar170🕴🏼#Thalaivar170Team has gotten even more charismatic 🌟 with the addition of the dashing @RanaDaggubati 🎬🤗✌🏻@rajinikanth @tjgnan @anirudhofficial @officialdushara @ritika_offl @ManjuWarrier4… pic.twitter.com/tzF0njVN3h
— Vamsi Kaka (@vamsikaka) October 3, 2023