తమిళనాడు రాష్ట్రంలో శనివారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 100 కోట్ల ఆస్తి బూడిదపాలైంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… చెన్నైలోని మనాలి సమీపంలోని వైకాడు ప్రాంతంలోని సబ్బు పొడి గోదాములో శనివారం ఉదయం భారీ ఎత్తున మంటలు ఎగిసి పడ్డాయి.
ఈ ప్రమాదంలో సుమారు 100 కోట్ల రూపాయల విలువైన వస్తువలు కాలి బూడిద అయినట్లు అధికారులు వివరించారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.ప్రమాదం గురించి సమాచారం అందుకున్న సిబ్బంది వెంటనే ఆరు అగ్ని మాపక యంత్రాలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
వెంటనే మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ప్రమాద స్థలానికి కొద్ది దూరంలోనే గ్యాస్ సిలిండర్ల ఫ్యాక్టరీ కూడా ఉంది. దీంతో సిబ్బంది మరింత అప్రమత్తం అయ్యారు. మనాలి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
తమిళనాడు అగ్నిమాపక శాఖ జాయింట్ డైరెక్టర్ ప్రియా రవిచంద్రన్ ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు సిబ్బంది చేస్తున్న పనులను పరిశీలించారు. ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు అని వారు వెల్లడించారు.
Also read: సూపర్ స్టార్ మహేష్ ని కూడా కలిసిన నెట్ఫ్లిక్స్ సీఈవో!