T20 World Cup 2024: ఈ నలుగురు ఆటగాళ్లకు ప్రపంచకప్ జట్టులో చోటు దక్కడం కష్టమే!

త్వరలో టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ఐపీఎల్‌లో సత్తా చాటిన వారినే ఈ టోర్నీకి సెలక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. కానీ లీగ్‌లో ఫామ్ కోల్పోయిన ఒక నలుగురు ఆటగాళ్లు టోర్నీకి సెలక్ట్ కావడం దాదాపు అసాధ్యమని చెప్పుకోవచ్చు. వారు ఎవరో చూసేయండి.

T20 World Cup 2024: ఈ నలుగురు ఆటగాళ్లకు ప్రపంచకప్ జట్టులో చోటు దక్కడం కష్టమే!
New Update

క్రికెట్ ఫ్యాన్స్‌కు ఐపీఎల్ 2024(IPL 2024) మంచి కిక్ ఇస్తోంది. టోర్నీలో కొందరు ఆటగాళ్లు రెచ్చిపోతున్నారు. అయితే కొందరు ప్లేయర్లు మాత్రం అంచనాలను అందుకోలేకపోతున్నారు. త్వరలో టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ఐపీఎల్‌లో సత్తా చాటిన వారినే ఈ టోర్నీకి సెలక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. కానీ కొందరు కీలక ఆటగాళ్లు ఐపీఎల్‌లో చెత్త ఫామ్‌లో ఉండి సక్సెస్ కాలేకపోతున్నారు. వీరు టీ20 వరల్డ్ కప్ రేసులో చాలా వెనుకబడ్డారు.టీ20 ప్రపంచ కప్ 2024లో ఈసారి మొత్తం 20 జట్లు పోటీ పడుతున్నాయి. అన్ని దేశాలు మే 1 వరకు టోర్నీలో ఆడే స్క్వాడ్‌ను ప్రకటించానికి ఐసీసీ గడువు విధించింది. మే 25 వరకు జట్లలో మార్పులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో తుది జట్టును ఖరారు చేసేందుకు కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్, సెలక్టర్ అజిత్ అగార్కర్ త్రయం తరచూ సమావేశమవుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

యశస్వి జైస్వాల్

యువ సంచలనం, లాంగ్ ఫార్మాట్‌లో ఓపెనర్‌గా సత్తా చాటిన యశస్వి జైస్వాల్ అంచనాలకు తగ్గట్లు ఐపీఎల్‌లో రాణించలేకపోతున్నాడు. మరోవైపు ఓపెనర్ బెర్తుకు పోటీలో ఉన్న రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఇద్దరూ లీగ్‌లో మంచి ఫామ్‌లో ఉన్నారు. ఇషాన్ కిషన్ కూడా సక్సెస్ అవుతున్నాడు. అలాగే విరాట్ కోహ్లీని కూడా ఓపెనర్‌ బెర్తుకు పరిగణించినట్లు వార్తలు వచ్చాయి. అందువల్ల యశస్వి జైస్వాల్ టీ20 వరల్డ్ కప్‌కు సెలక్ట్ అవ్వడం కష్టమే.

KL రాహుల్

లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఈ ఏడాది ఐపీఎల్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాడు. తనదైన శైలిలో అతడు బ్యాటుతో సక్సెస్ అవ్వట్లేదు. టీమ్‌లో మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా ఆడటానికి బదులుగా ఓపెనర్‌గా కొనసాగుతున్నాడు. అయితే ఇంటర్నేషనల్ టీ20ల్లో భారత్‌కు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్‌ బెస్ట్ ఓపెనింగ్ జోడీగా భావిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో, రాహుల్‌ను ఓపెనర్‌గా సెలక్ట్ చేసే అవకాశాలు చాలా తక్కువ.

రవిచంద్రన్ అశ్విన్

రవిచంద్రన్ అశ్విన్ గత మూడు ఐసీసీ వైట్ బాల్ ఈవెంట్స్‌కు భారత జట్టులో ఉన్నాడు. టీ20 వరల్డ్ కప్ జరిగే వెస్టిండీస్, అమెరికాలోని పిచ్‌లు స్పిన్నర్లకు అనుకూలంగా ఉండవచ్చు. కాబట్టి అశ్విన్ ఈ టోర్నీకి కూడా సెలక్ట్ అవుతాడనే అంచనాలు ఉండేవి. కానీ ఈ రాజస్థాన్ రాయల్స్ బౌలర్ ఇప్పటి వరకు ఐపీఎల్ 2024లో ఆకట్టుకునే ప్రదర్శన చేయలేదు. దీంతో అతన్ని టీ20 వరల్డ్ కప్‌కు సెలక్ట్ చేయడం కష్టమని చెప్పుకోవచ్చు.

జితేష్ శర్మ

పంజాబ్ కింగ్స్ బ్యాటర్ జితేష్ శర్మకు టీ20ల్లో బెస్ట్ స్ట్రైక్ రేట్‌ ఉంది. అయితే ఈ సీజన్‌లో అతడి నుంచి ఇప్పటి వరకు బెస్ట్ పర్ఫార్మెన్స్‌ను ఫ్యాన్స్ చూడలేదు. ఈ వికెట్ కీపర్ బ్యాటర్, లీగ్‌లో మిగిలిన గేమ్స్‌లో సత్తా చాటాల్సి ఉంది. లేదంటే దినేష్ కార్తీక్ మళ్లీ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.

#t20-world-cup-2024 #ipl2024
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe