T20 World Cup 2024: వర్షం కారణంగా సూపర్-8 మ్యాచ్ రద్దు అయితే ఏం జరుగుతుంది?

భారత్-కెనడాల మ్యాచ్ వర్షార్పణం అయింది. ఇప్పటికే టీమిండియా సూపర్-8 కు చేరినందున ఇబ్బంది ఏమీ లేదు. కానీ, సూపర్-8  దశలో వర్షం కురిస్తే ఎలా? సూపర్-8కి రిజర్వ్ డే లేదు. కనీసం 5 ఓవర్ల మ్యాచ్ అయినా ప్రయత్నిస్తారు. అదీ కుదరకపోతే రెండు టీమ్స్ కు ఒక్కో పాయింట్ ఇస్తారు

T20 World Cup 2024: వర్షం కారణంగా సూపర్-8 మ్యాచ్ రద్దు అయితే ఏం జరుగుతుంది?
New Update

T20 World Cup 2024 Super 8 Rules: భారత్ - కెనడా మధ్య ఫ్లోరిడాలో జరగాల్సిన T20 ప్రపంచ కప్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. ఈ మ్యాచ్ రద్దు కావడం ఇరు జట్లపై ఎలాంటి ప్రభావం లేదు. ఎందుకంటే టీమ్ ఇండియా ఇప్పటికే సూపర్ 8 రౌండ్‌కు అర్హత సాధించింది. కెనడా ఇప్పటికే టీ20 ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించింది. ఇప్పుడు భారత జట్టు జూన్ 20న తమ తొలి సూపర్-8 మ్యాచ్ ఆడనుంది. బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌లో ఆఫ్ఘనిస్థాన్ (IND vs AFG)తో ఈ మ్యాచ్ ఆడనుంది. అయితే సూపర్ 8 రౌండ్‌లో మ్యాచ్‌కు వర్షం వలన అంతరాయం కలిగితే ఫలితం ఎలా ఉంటుంది? ఈ రౌండ్ కోసం రిజర్వ్ డే ఉంటుందా? ఉండదా? తెలుసుకుందాం. 

సూపర్-8 రౌండ్‌కు కూడా రిజర్వ్ డే లేదు

గ్రూప్-స్టేజ్ మ్యాచ్‌ల మాదిరిగానే సూపర్-8 మ్యాచ్‌లకు రిజర్వ్ డేని నిర్ణయించలేదు. అంటే వర్షం పడితే ఎలాగైనా అదే రోజు మ్యాచ్ పూర్తి చేయాలి. ఈ పరిస్థితిలో, మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించడానికి ఒక్కొక్కటి 5 ఓవర్ల మ్యాచ్ ఆడిస్తారు. అయినా సరే.. మ్యాచ్ జరగకపోతే, రెండు జట్లకు ఒక్కో పాయింట్ ఇస్తారు.  సూపర్-8 రౌండ్‌లో ఒక్కో జట్టు 3 మ్యాచ్‌లు ఆడుతుంది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయినా.. జట్లకు భారీ నష్టం తప్పదు. ఎందుకంటే గ్రూప్ దశతో పోలిస్తే సూపర్ 8 రౌండ్‌లో అన్ని జట్లూ ఒక మ్యాచ్ తక్కువ ఆడాల్సి ఉంటుంది. అలాంటప్పుడు వర్షం కారణంగా 1 మ్యాచ్ రద్దయితే జట్లు తర్వాతి రౌండ్‌కు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

Also Read: ఇండియా, కెనడా మ్యాచ్ రద్దు

సెమీ-ఫైనల్ కథ ఏమిటి?

T20 World Cup 2024: మొదటి సెమీ-ఫైనల్- ఫైనల్ మ్యాచ్‌లో వర్షం కురిస్తే, మ్యాచ్ ఫలితం పొందడానికి అదే రోజు కనీసం 10 ఓవర్ల ఆట ఆడవలసి ఉంటుంది. ఇది సాధ్యం కాకపోతే మ్యాచ్ రిజర్వ్ డేకి వెళుతుంది. మొదటి సెమీ-ఫైనల్ - ఫైనల్ మ్యాచ్‌లకు 190 నిమిషాల అదనపు సమయం, రిజర్వ్ డే ఉంటుంది. కానీ రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌కు రిజర్వ్ డేని కేటాయించలేదు. బదులుగా, రెండవ సెమీ-ఫైనల్‌కు అదనంగా 250 నిమిషాల అదనపు సమయం ఇచ్చారు.  ఈ లోపు మ్యాచ్‌ను ముగించాల్సి ఉంది.

ఒకవేళ మ్యాచ్‌ రద్దయితే పాయింట్ల పట్టికలో ఏ జట్టు ఆధిక్యంలో ఉందో ఆ జట్టు విజేతగా ప్రకటిస్తారు. ఇక్కడ చెప్పుకోవలసిన విషయం ఏమిటంటే..  రెండో సెమీఫైనల్‌కి, ఫైనల్‌కి ఒక్కరోజు మాత్రమే గ్యాప్‌ ఉంది. రెండో సెమీఫైనల్ జూన్ 27న, ఫైనల్ జూన్ 29న జరుగుతుంది.

#t20-world-cup-2024 #cricket
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe