Cholesterol: ఈ లక్షణాలు కనిపిస్తే.. మీ శరీరంలో కొవ్వు పెరుగుతుందని అర్థం జాగ్రత్త..! అనారోగ్యపు ఆహారపు అలవాట్లు, జీనశైలి చెడు కొలెస్ట్రాల్ పెరుగుదలకు కారణమవుతాయి. శరీరంలో కనిపించే కొన్ని మార్పులు రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుదలను సూచిస్తాయి. కళ్ళు చుట్టూ పసుపు మచ్చలు, ముఖం పై గడ్డలు, పసుపు రంగు చర్మం, మొహం పై వాపు చెడు కొలెస్ట్రాల్ పెరుగుదలకు సంకేతాలు. By Archana 30 Jun 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Cholesterol: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుదల గురించి ఖచ్చితమైన గుర్తింపు లేదు. ఇది లిపిడ్ పరీక్ష ద్వారా మాత్రమే గుర్తించబడుతుంది. కానీ శరీరంలో LDL అంటే చెడు కొలెస్ట్రాల్ పెరగడం మొదలవుతుందని సూచించే కొన్ని లక్షణాలు శరీరం పై కనిపిస్తాయి. ఈ లక్షణాలను సరైన సమయంలో అర్థం చేసుకొని..సరైన జీవనశైలి, ఆహారంలో మార్పుల ద్వారా చెడు కొలెస్ట్రాల్ పెరుగుదలను నియంత్రించవచ్చు. ముఖ్యంగా ముఖంపై అలాంటి లక్షణాలు కనిపిస్తే, ఖచ్చితంగా మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ చెక్ చేసుకోండి. చర్మం పసుపు మొహం పసుపు రంగులోకి మారడం. ఇది రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం వల్ల వస్తుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు, రక్త ప్రసరణను అడ్డుకుంటుంది. దీని కారణంగా చర్మంపై పసుపు రంగు కనిపించడం ప్రారంభమవుతుంది. ముఖం మీద గడ్డలు కనిపిస్తున్నాయి కొన్నిసార్లు ముఖంపై చిన్న చిన్న గడ్డలు కనిపిస్తాయి. వాటంతట అవే తగ్గిపోతాయని భావించి వీటిని విస్మరిస్తారు. కానీ సాధారణంగా కళ్ల చుట్టూ ఏర్పడే ఈ గడ్డలు అధిక చెడు కొలెస్ట్రాల్ అని అర్థం. కళ్ళు చుట్టూ పసుపు మచ్చలు చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు, కళ్ల చుట్టూ లేత పసుపు రంగు దద్దుర్లు, కొన్ని చిన్న పసుపు మొటిమలు కనిపిస్తాయి. ఇది చెడు కొలెస్ట్రాల్ పెరుగుదలను సంకేతంగా పరిగణించబడతాయి. ముఖం మీద వాపు ముఖం మీద వాపు రావడానికి చాలా కారణాలు ఉండవచ్చు. కానీ కొన్నిసార్లు చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల కూడా ఈ వాపు వస్తుంది. దీని వల్ల ముఖం ఉబ్బినట్లు కనిపిస్తుంది. లేదా చర్మం పూర్తిగా పొడిబారుతుంది. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. Also Read: Infinix ZeroBook Ultra : AI ఫీచర్లతో అల్ట్రా మోడల్ ల్యాప్‌టాప్.. Infinix ZeroBook Ultra రూ.60వేల కంటే తక్కువ..! – Rtvlive.com #ldl-cholesterol మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి