Suzuki Recalls 4 lakh 2 Wheelers: దేశంలోని ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ సుజుకీ ఇండియా మార్కెట్ నుంచి 4 లక్షలకు పైగా బైక్‌లు, స్కూటర్లను రీకాల్ చేయాలని నిర్ణయించింది. ఇగ్నిషన్ కాయిల్‌కు అనుసంధానించిన హైటెన్షన్ కార్డ్‌లో లోపం గుర్తించిన తర్వాత మొత్తం 3,88,411 ద్విచక్ర వాహనాలను చెక్ చేయాల్సి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. రిపోర్ట్ ప్రకారం, ఏప్రిల్ 30, 2022 – డిసెంబర్ 3, 2022 మధ్య తయారు అయినా ప్రముఖ యాక్సెస్ 125, అవెనిస్ 125 – బర్గ్మాన్ స్ట్రీట్ 125లను రీకాల్ చేయాలని కంపెనీ యోచిస్తోంది. ఇతర బైక్‌లలో, టెక్-లోడెడ్ V-Strom 800 DE మోడల్లో కూడా అదే సమస్య కనిపించింది. అంతేకాకుండా, వెనుక టైర్లో సమస్య ఉన్నట్లు కూడా కంపెనీ గుర్తించింది. బ్రాండ్ షేర్ చేసిన వివరాల ప్రకారం, V-Strom 800 DE టైర్ ట్రెడ్‌లో భాగంగా విడిపోయి పగుళ్లకు కారణం కావచ్చు కాబట్టి ఇది కూడా పరిశీలనలోకి వస్తుంది.
పూర్తిగా చదవండి..Suzuki India ఏకంగా 4 లక్షల సుజుకి టూవీలర్స్ రీకాల్.. మీ వెహికిల్ ఉందేమో చెక్ చేసుకోండి ఇలా!
దేశంలోని ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ సుజుకి ఇండియా కస్టమర్లు ఈ వార్తను తప్పక చదవండి. మార్కెట్ నుండి 4 లక్షలకు పైగా బైక్‌లు - స్కూటర్లను రీకాల్ చేయాలని కంపెనీ నిర్ణయించింది. ఇలా ఎందుకు చేస్తున్నారో.. మీ వెహికిల్ ఎలా చెక్ చేసుకోవాలో ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు
Translate this News: