Supreme Court: అమరావతి ఆర్5 జోన్‌పై సుప్రీంకోర్టులో జగన్ ప్రభుత్వానికి షాక్

అమరావతి ఆర్‌5 జోన్ అంశంపై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి షాక్ తగిలింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఆర్- 5 జోన్‌పై విచారణ జరిపిన జస్టిస్ సంజీవ్ ఖన్నాతో కూడిన ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను నవంబర్‌ నెలకు వాయిదా వేసింది.

New Update
Big Breaking: అక్టోబర్ 3న సుప్రీం కోర్టు ముందుకు చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్..

Amaravati R5 Zone: అమరావతి ఆర్‌-5 జోన్ అంశంపై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి షాక్ తగిలింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఆర్-5 జోన్‌పై విచారణ జరిపిన జస్టిస్ సంజీవ్ ఖన్నా(Justice Sanjiv Khanna)తో కూడిన ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను నవంబర్‌ నెలకు వాయిదా వేసింది. దీంతో అక్కడ ఇళ్లు కట్టి పేదలకు ఇవ్వాలన్న ప్రభుత్వానికి చుక్కెదురైంది. రాజధాని అమరావతి పరిధిలోని ఆర్-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణాలు నిలిపివేయాలని గతంలో ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. దీంతో హైకోర్టు ఉత్తర్వులను ప్రభుత్వం సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.

ఆర్-5 జోన్‌లో పేదలకు ఇళ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించండంతో అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సుప్రీం ఉత్తర్వుల ప్రకారం పేదలకు ఇస్తున్న పట్టాలు అంతిమ తీర్పునకు లోబడి ఉంటాయని ధర్మాసనం గుర్తు చేసింది. స్థలాలు ఇవ్వడానికి మాత్రమే అనుమతి ఉంది కానీ కట్టడాలు కట్టడానికి కాదని స్పష్టం చేసింది. సీఆర్డీఏకు చెల్లించాల్సిన రూ.345కోట్లు చెల్లించలేదని.. అలాగే రూ.1500 కోట్లు పెట్టి ఇళ్లు నిర్మాణాలు చేపడితే ఆ సమయంలో తీర్పు వ్యతిరేకంగా వస్తే ఆ డబ్బుకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించింది. ప్రజల సొమ్ము దుర్వినియోగం చేస్తుంటే కోర్టులు చూస్తూ ఊరుకోవని తీర్పులో తెలిపింది. అయితే ఈ తీర్పుపై ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానంలోనూ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది.

ప్రభుత్వం అమరావతిని నిర్వీర్యం చేసే లక్ష్యంతోనే కోర్ క్యాపిటల్ ఏరియాలో ఆర్-5 జోన్‌ ఏర్పాటు చేసిందని రైతులు, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇతర చోట్ల స్థలాలు ఉన్నప్పటికీ పేదలకు ఇళ్లు కట్టించకుండా.. కేవలం రాజధాని ప్రాంతంలోనే ఎందుకు ఇళ్లు కట్టించడానికి మొగ్గు చూపుతున్నారని మండిపడుతున్నారు. సీఆర్డీఏ చట్టాన్ని ఉల్లంఘించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే మొత్తానికి సుప్రీంకోర్టులో రైతులకు మద్దతుగా తీర్పు రావడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఆర్5 జోన్ అంటే ఏమిటి?

గుంటూరు, విజయవాడ నగరాలకు చెందిన పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక జోన్‌ ఏర్పాటు చేసింది. ఇందుకోసం సీఆర్‌డీఏ చట్టాన్ని కూడా సవరణ చేసింది. తుళ్లూరు మండలంలోని మందడం, ఐనవోలు, మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు గ్రామాల పరిధిలో 900.97 ఎకరాల మేర పేదల ఇళ్ల కోసం జోనింగ్‌ చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అమరాతిలో ఎంపిక చేసిన భూముల ప్రాంతాన్ని ఆర్‌-5 జోన్‌గా పేర్కొంటూ గెజిట్​ నోటిఫికేషన్​ జారీ చేసింది.

Also Read: వన్‌ నేషన్‌.. వన్‌ ఎలక్షన్.. బిల్లుకు ముహూర్తం ఫిక్స్!

Advertisment
Advertisment
తాజా కథనాలు