Double ISmart: సూపర్ అప్డేట్ ఇచ్చిన.. డబుల్ ఇస్మార్ట్ టీమ్..!

పూరిజగన్నాథ్ దర్శకత్వంలో హీరో రామ్ నటిస్తున్న చిత్రం డబుల్ ఇస్మార్ట్. సింగర్ ధనుంజయ్ ఈ సినిమాకు సంబంధించి ఓ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ లో " నా గురువు మణిశర్మతో డబుల్ ఇస్మార్ట్ మ్యూజిక్ కంపొజిషన్ మొదలైంది" అనే క్యాప్షన్ తోమణిశర్మతో కలిసి లంచ్ చేస్తున్న ఫొటోను షేర్ చేశారు.

New Update
Double ISmart: సూపర్ అప్డేట్ ఇచ్చిన.. డబుల్ ఇస్మార్ట్ టీమ్..!

Double ISmart: డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా 'ఇస్మార్ట్ శంకర్' సీక్వెల్ గా తెరకెక్కుతున్న చిత్రం డబుల్ ఇస్మార్ట్. ప్రస్తుతం మూవీ టీమ్ అంతా సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ముంబై లో ప్రధాన పాత్రలకు సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో ప్రముఖ నటుడు సంజయ్ దత్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. మేకర్స్ సినిమాను 2024 మార్చ్ 8 న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇటీవలే విడుదల తేదీకి సంబంధించి 100 రోజుల కౌంట్ డౌన్ పోస్టర్ ను రీలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో రామ్ చేతిలో గన్ పట్టుకొని టెరిఫిక్ లుక్ లో కనిపించారు. దీంతో సినిమాలో భారీ యాక్షన్ సెక్వెన్సెస్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ పోస్టర్ ను రివర్స్ లో ప్రజెంట్ చేసి మరింత ఆసక్తిని పెంచారు.

publive-image

డబుల్ ఇస్మార్ట్ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్, చార్మి కలిసి నిర్మిస్తున్నారు. సినిమాకు టాప్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సినిమా మ్యూజిక్ కు సంబంధించి మణిశర్మ కు సహాయకుడిగా పనిచేస్తున్న సింగర్ ధనుంజయ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ లో సింగర్ ధనుంజయ్ " నా గురువు మణిశర్మతో డబుల్ ఇస్మార్ట్ మ్యూజిక్ కంపొజిషన్ మొదలైంది" అనే క్యాప్షన్ తో మణిశర్మ, ధనుంజయ్, పూరి జగన్నాథ్, చార్మి, రచయిత భాస్కర్ భట్ల కలిసి లంచ్ చేస్తున్న ఫొటోను షేర్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు విషెస్ తెలియజేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

publive-image

Also Read: Salaar Trailar: “దూరంగా ఉన్న ఒక ప్రాంతంలో విడదీయలేని స్నేహం”.. సలార్ ట్రైలర్ అదిరిపోయింది..!

Advertisment
తాజా కథనాలు