Diabetis : పగటి వెలుగుతో టైప్‌ 2 మధుమేహనికి చెక్‌!

నెదర్లాండ్‌ శాస్త్రవేత్తలు టైప్‌ 2 తో బాధపడే వారికి ఓ శుభవార్త తెలిపారు. పగటి పూట లభించే వెలుగుతో మధుమేహానికి చికిత్స చేయవచ్చని పరిశోధనలో వెల్లడైంది. రాత్రి పూట కూడా విధులు నిర్వహించడం వల్ల ఈ టైప్‌ 2 డయాబెటిస్ బారిన పడాల్సి వస్తుందని నిపుణలు వెల్లడించారు.

New Update
Diabetis : పగటి వెలుగుతో టైప్‌ 2 మధుమేహనికి చెక్‌!

నేడు ప్రతి మంది లో 7 గురు మధుమేహం(Diabetis)తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. డయాబెటిస్‌ ఒక్కసారి వచ్చిందంటే..దానిని తగ్గించుకోవడం కోసం నోటిని అదుపులో పెట్టుకోవాల్సి వస్తుంది. కావాల్సినవి తినకుండా ఉండాల్సి వస్తుంది. ఎన్ని మందులు వాడుతున్నప్పటికీ కొన్ని సార్లు కంట్రోల్‌ లోకి మాత్రం అసలు రాదు.

ఈ క్రమంలోనే నెదర్లాండ్‌ శాస్త్రవేత్తలు టైప్‌ 2 తో బాధపడే వారికి ఓ శుభవార్త తెలిపారు. పగటి పూట లభించే వెలుగుతో మధుమేహానికి చికిత్స చేయవచ్చని పరిశోధనలో వెల్లడైంది. రాత్రి పూట కూడా విధులు నిర్వహించడం వల్ల ఈ టైప్‌ 2 డయాబెటిస్ బారిన పడాల్సి వస్తుందని నిపుణలు వెల్లడించారు.

Also read: పోలీసు స్టేషన్‌ కి తాళం వేసిన మహిళ..సమస్య పరిష్కరించడం లేదని వినూత్న నిరసన!

అందుకే పగటి సమయంలో సహజంగా దొరికే వెలుతురు శరీరాన్ని ఉత్తేజం చేయడంతో పాటు కొన్ని జీవకారక క్రియలను సక్రమంగా పనిచేసేలా చేస్తుందని వారు వెల్లడించారు. పగటి సమయంలో ఉద్యోగాల రీత్యా, పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల చాలా మంది ఇళ్ల నుంచి , కార్యాలయాల నుంచి బయటకు రావడం లేదు.

దీంతో కార్యాలయాల్లో చాలా మంది విద్యుత్‌ వెలుగుల మధ్యనే ఉంటున్నారు. దీంతో టైప్ 2 మధుమేహం వారిని అక్కున చేర్చుకుంటుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కొందరు ఎంపిక చేసిన టైప్‌ 2 మధుమేహం ఉన్నవారిని సహజ కాంతి, కృతిమ కాంతిలో ఉంచి చూడడంతో సహజ కాంతిలో ఉన్నవారికి టైప్‌ 2 మధుమేహం కంట్రోల్‌ లోకి వచ్చినట్లు వారు వెల్లడించారు.

శరీర జీవ గడియారాన్ని నియంత్రించడంలో పెర్‌1, క్రై1 అనే జన్యువులు సాయపడతాయని శాస్త్రవేత్తలు తెలిపారు. అవి సహజసిద్ధ కాంతిలోనే ఎక్కువగా క్రియాశీలమవుతున్నట్లు వివరించారు.

Also read: నాకు ఈ భర్త వద్దు నాన్న..మేళతాళాలతో స్వాగతం పలికిన పుట్టింటి వారు!

Advertisment
Advertisment
తాజా కథనాలు