Former CEO of YouTube: సుసాన్ వోజ్‌కికీ మృతి.. సుందర్ పిచాయ్ ఎమోషనల్ పోస్ట్..

యూట్యూబ్ మాజీ సీఈవో సుసాన్ వోజ్కికీకీ ఇక లేరు. ఆమె రెండు సంవత్సరాలుగా క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఈ విషయాన్ని శనివారం ప్రకటించారు. యూట్యూబ్‌ను అభివృద్ధి చేయడంలో వోజ్కికీకీ ఎంతో కీలక పాత్ర పోషించారని ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

New Update
Former CEO of YouTube: సుసాన్ వోజ్‌కికీ మృతి.. సుందర్ పిచాయ్ ఎమోషనల్ పోస్ట్..

Former CEO of YouTube Susan Wojcicki: యూట్యూబ్ మాజీ సీఈవో సుసాన్ వోజ్కికీ ఇక లేరు. ఆమె రెండు సంవత్సరాలుగా క్యాన్సర్‌తో పోరాడుతూ, ప్రాణాలు విడిచారు. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఈ విషయాన్ని శనివారం వెల్లడించారు. వోజ్కికీ యూట్యూబ్‌ను అభివృద్ధి చేయడంలో చాలా కీలక పాత్ర పోషించారు అని ఆయన చెప్పారు.

సుందర్ పిచాయ్ సంతాపం వ్యక్తం చేశారు

సుందర్ పిచాయ్ (Sundar Pichai) ఆమె మరణానికి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. "రెండేళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న నా ప్రియ స్నేహితురాలు సుసాన్ వోజ్కికీ మనల్ని విడిచి వెళ్ళటం నాకు చాలా బాధగా ఉంది. ఆమె Google చరిత్రలో కీలక వ్యక్తి, ఆమె లేని ప్రపంచాన్ని ఊహించడం కష్టం. ఆమె ప్రపంచంపై గొప్ప ప్రభావం చూపిన అద్భుతమైన వ్యక్తి, నాయకురాలు, స్నేహితురాలు. నేను గూగుల్‌లో పని చేస్తున్న ఆమె గురించి చెప్పే చాలా మందిలో నేను ఒకడిని," అని సుందర్ పిచాయ్ అన్నారు. "మేము ఆమెను చాలా మిస్ అవుతాము. ఆమె కుటుంబానికి మా సానుభూతి అని పేర్కొన్నారు."

సుసాన్ వోజ్కికీ Google ప్రారంబంలో ఉద్యోగులలో ఒకరు, AdSenseని సృష్టించినందుకు 'Google Founders Award' అందుకున్నారు. ఆమె YouTube CEOగా ఉన్నప్పుడు, యూట్యూబ్ ప్లాట్‌ఫారమ్ మిలియన్ల సృష్టికర్తలు, బిలియన్ల వీక్షకులతో ప్రపంచ స్థాయిలో ఎదిగింది. 2014 నుండి 2023 ప్రారంభం వరకు, ఆమె YouTubeను నడిపించారు.

ఇది కూడా చదవండి: Nyjah Huston: వారానికే రంగు పోయింది.. ఒలింపిక్‌ పతకాలపై అథ్లెట్‌ పోస్ట్ వైరల్!

ఫిబ్రవరి 2023లో గూగుల్ యాజమాన్యాన్ని విడిచిన తర్వాత, భారతీయ-అమెరికన్ నీల్ మోహన్ కొత్త YouTube CEOగా నియమితులయ్యారు. ఇలాంటి పరిస్థితిలో ఆమెను కోల్పోవడం చాలా బాధాకరం.

Advertisment
తాజా కథనాలు