రెండిటికి ఒకే చెంచా ఉపయోగించడం నచ్చదు! సుధామూర్తి కేవలం ఇన్ఫోసిస్ మూర్తి భార్యగానే కాకుండా..తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ఉంది. సుధా మూర్తి నిత్యం ఏదోక విధంగా వార్తల్లో ఉంటారు. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. సుధామూర్తి ప్యూర్ వెజిటెరియన్ అని ఆమె చాలా సందర్భాల్లో చెప్పారు. By Bhavana 26 Jul 2023 in నేషనల్ Scrolling New Update షేర్ చేయండి సుధామూర్తి కేవలం ఇన్ఫోసిస్ మూర్తి భార్యగానే కాకుండా..తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ఉంది. సుధా మూర్తి నిత్యం ఏదోక విధంగా వార్తల్లో ఉంటారు. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. సుధామూర్తి ప్యూర్ వెజిటెరియన్ అని ఆమె చాలా సందర్భాల్లో చెప్పారు. ఆమె చేసే పనుల విషయంలో సాహసాలు చేసేందుకు ఇష్టపడతాను కానీ వంటల విషయంలో మాత్రం ఎలాంటి సాహసాలు చేయనని ఆమె వివరించారు. తాను పూర్తిగా వెజిటేరియన్ అని ఆమె చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు వెల్లుల్లి కూడా ముట్టుకొలేదని ఆమె వివరించారు. బయట ప్రదేశాలకు వెళ్లేటప్పుడు కూడా తన ఆహారాన్ని తానే తీసుకుని వెళ్తానని చెప్పుకొచ్చారు. విదేశాలకు వెళ్లినప్పుడు అయితే వెజిటేరియన్ రెస్టారెంట్ కోసం వెతుకుతానని, లేకపోతే సొంతంగా వంట చేసుకుంటానని వివరించారు. అందుకే రెడీ టు ఇట్ ఆహారపదార్థలను దగ్గర ఉంచుకుంటానని ఆమె వివరించారు. వెజ్ కు, నాన్‌వెజ్ కు ఒకే చెంచా ఉపయోగించడం తనకు నచ్చదన్నారు. అందుకే తాను హోటళ్లను ఎంపిక చేసుకునేటపుడు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తానని వెల్లడించారు. ముందు జాగ్రత్తగా తన హ్యాండ్ బ్యాగ్ నిండుగా తినుబండారాలను తీసుకెళ్తానని చెప్పుకొచ్చారు. తన వద్ద ఓ కుకింగ్ బ్యాగ్ ఉందని అందులో చిన్న కుక్కర్ కూడా ఉందని, దానిని తన సొంతంగా ఆహారాన్ని వండుకోవడానికి ఉపయోగిస్తానని పంచుకున్నారు. చిన్నతనంలో తన అమ్మమ్మ ఇలా చేస్తే ఆట పట్టించేదానిని అని వివరించారు. అయితే తాజాగా సుధామూర్తి కామెంట్ల పై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆమెకు భారతీయ మహిళ అంటూ మద్దతు తెలుపుతున్నారు. మరికొందరు చాదస్తమంటూ వ్యతిరేకిస్తున్నారు. మరి కొందరు ఏకంగా ఆమె కుటుంబాన్ని ఉద్దేశిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఆమె అల్లుడు, బ్రిటన్ ప్రధాన మంత్రి రుషి సునాక్ మాంసాహారి అనే విషయాన్ని గుర్తు చేస్తూ, ఆయనను ఆయన పిల్లలను ముట్టుకోవద్దని సలహా ఇస్తున్నారు. #sudamurty #veg-non-veg-comments మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి