Suchana Seth: ' భర్త నాకు నెలకు రూ.2.5 లక్షల మెయింటెనెన్స్ అలవెన్స్ కావాలి..' షాకింగ్ విషయాలు!

నాలుగేళ్ల కొడుకును హత్య చేసిన తల్లి సుచనా గురించి కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. భర్త వెంకటరమణ నుంచి నెలకు రూ.2.5 లక్షల మెయింటెనెన్స్ అలవెన్స్ పొందాలని సుచనా సేథ్‌ కోరినట్లు సమాచారం. తన భర్త వార్షిక ఆదాయం కోటి రూపాయలకు పైగా ఉందని ఆమె పేర్కొన్నారు.

Suchana Seth: ' భర్త నాకు నెలకు రూ.2.5 లక్షల మెయింటెనెన్స్ అలవెన్స్ కావాలి..' షాకింగ్ విషయాలు!
New Update

నాలుగేళ్ల కుమారుడిని హత్య చేసిన తల్లి సుచానా సేథ్(Suchana Seth) కేసు టాక్‌ ఆఫ్‌ ది కంట్రీగా మారింది. ఒక తల్లి తన చిన్నబిడ్డని ఎలా చంపుకుంటుందని సోషల్ మీడియాలో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసులో పోలీసుల విచారణ జరుగుతుండగా, నిందితురాలిని 6 రోజుల పాటు రిమాండ్ కు తరలించారు. ఆమెను విచారించగా పలు షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి.

అలవెన్స్ కోవాలి:

భర్త వెంకటరమణ నుంచి నెలకు రూ.2.5 లక్షల మెయింటెనెన్స్ అలవెన్స్ పొందాలని సుచనా సేథ్‌ కోరినట్లు సమాచారం. తన భర్త వార్షిక ఆదాయం కోటి రూపాయలకు పైగా ఉందని ఆమె పేర్కొన్నారు. వెంకటరమణ తనను శారీరకంగా వేధిస్తున్నాడని ఆమె ఆరోపించింది. ఈ మేరకు ఆయన వాట్సాప్ సందేశాలు, ఫొటోలను కోర్టుకు సమర్పించినట్లు సమాచారం. అయితే రమణ శారీరక వేధింపుల ఆరోపణలను ఖండించారు. అటు భార్య ఇంటికి వెళ్లకుండా, మాట్లాడకుండా కోర్టు నిషేధం విధించింది. అయితే ఆదివారం మాత్రం చిన్నారిని కలిసేందుకు కోర్టు స్వేచ్ఛనిచ్చింది. ఎలాగైనా భర్త కొడుకును కలవకూడదని భావించిన సుచనా నాలుగేళ్ల చిన్నారిని చంపేసింది.

కోర్టులోనే విడాకుల కేసు:

2010లో ప్రేమ వివాహం చేసుకున్న వెంకటరమణ, సుచన బెంగళూరులోనే ఉంటున్నారు. వీరిద్దరికీ 2019లో మగబిడ్డ జన్మించాడు. కరోనా వైరస్ విజృంభణ సమయంలో ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. అయితే వీరిద్దరూ ఇంకా విడాకులు తీసుకోలేదు.దీనిపై కోర్టులో పిటిషన్ దాఖలైంది. విచారణ సందర్భంగా కొడుకును కోర్టు తల్లికి అప్పగించింది. బిడ్డను కలిసేందుకు తండ్రిని అనుమతించింది. ఇప్పుడు అదే తల్లి బిడ్డను చంపేసింది.

కర్ణాటకలోని చిత్రదుర్గలో మంగళవారం సుచనా సేథ్‌ని అరెస్టు చేశారు. అలాగే, వారి సమీపంలోని బ్యాగులో చిన్నారి మృతదేహం లభ్యమైంది. హోటల్ సిబ్బంది గదిని తనిఖీ చేయగా రక్తపు మరకలు కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. సమాచారంతో కర్ణాటక వెళ్తున్న డ్రైవర్ ను సంప్రదించిన పోలీసులు చాకచక్యంగా ఆమెను పట్టుకున్నారు.

Also Read: ఖమ్మం నుంచి సోనియా గాంధీ పోటీ?

#suchana-seth
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe