విశాఖ ఉక్కు పరిశ్రమ నిరసనకు 1000 రోజులు. మద్దతుగా విద్యాసంస్థల "బంద్" .!

విశాఖ ఉక్కు పరిశ్రమ కార్మికుల నిరసన నవంబర్ 8 వ తేదికి 1000 రోజుకు చేరుకోనుంది.ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల "బంద్" కి పిలుపు నిచ్చారు విద్యార్థి యువజన సంఘాల నాయకులు. ఈ మేరకు ఏలూరు జిల్లా PDSU కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు.

New Update
విశాఖ ఉక్కు పరిశ్రమ నిరసనకు 1000 రోజులు. మద్దతుగా విద్యాసంస్థల "బంద్" .!

Student Unions have called for a "Bandh" : నవంబర్ 8వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల "బంద్" కి పిలుపునిచ్చారు విద్యార్థి యువజన సంఘాల నాయకులు. ఈ మేరకు  PDSU కార్యాలయంలో విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ కార్మికుల నిరసన నవంబర్ 8 తేదికి 1000 రోజులు పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలో వారికి మద్దతుగా విద్యాసంస్థల "బంద్" కు పిలుపునిచ్చారు విద్యార్థి,యువజన సంఘాలు.

ముందుగా పి.డి.ఎస్.యు రాష్ట్ర అధ్యక్షులు ఇ. భూషణం మాట్లాడుతూ.. అనేకమంది ప్రజల ప్రాణాల పోరాట ఫలితంగా సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమని.. ఇప్పుడు నష్టాల్లో ఉందనేటువంటి సాకు చూపించి కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టాలని.. కారు చౌకగా పరిశ్రమను కట్టబెట్టాలని చూడడం దుర్మార్గమని భూషణం అన్నారు.విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో సాధించుకున్న విశాఖ పరిశ్రమ ప్రైవేటీకరణ చేయడం వల్ల ఈ రోజు లక్షలాదిమంది ప్రత్యక్షంగా, పరోక్షంగా వారి యొక్క జీవన ఉపాధిని కోల్పోయే అవకాశం ఉందని భూషణం తెలియజేశారు. ఈ డిమాండ్లు పరిష్కారం కోసమే నవంబర్ 8వ తేదీన రాష్ట్రవ్యాప్త బంద్ కి పిలిపోవడం జరిగిందని తెలిపారు. కావున, తల్లిదండ్రులు, విద్యార్థులు, యాజమాన్యాలు ఈ యొక్క బంధుకు సహకరించాలని భూషణం కోరారు.

ఏవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్. లెనిన్ బాబు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మణిహారంగా ఉన్నటువంటి విశాఖ పరిశ్రమ ప్రైవేటీకరణ ఆపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దాదాపు 50 సంవత్సరాలు కావస్తున్న నేటికీ విశాఖ ఉక్కు పరిశ్రమకు  గనులు కేటాయించకపోవడం చాలా హాస్యస్పదంగా ఉందని అన్నారు.

ఏ.ఐ.ఎస్.ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్ బాబు మాట్లాడుతూ.. విభజన హామీల్లో భాగంగా కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని నాటి కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చి దాదాపు పది సంవత్సరాలు కావస్తున్న.. నేటికీ ఉక్కు పరిశ్రమ కోసం కనీసం ఇటుక రాయి పేర్చ లేదని జాన్సన్ బాబు ఎద్దేవా చేశారు. పరిశ్రమకు ఎన్నిసార్లు శంకుస్థాపన చేసిన.. పనులు మొదలు పెట్టడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏ.ఐ.ఎస్.ఎ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అనిల్ మాట్లాడుతూ.. విభజన జరిగి నేటికీ 10 సంవత్సరాలు కావస్తున్న విభజన హామీల్లో కొన్ని మాత్రమే నెరవేర్చి చేతులు దులుపుకోవడం సరికాదని కేంద్ర ప్రభుత్వాన్ని అనిల్ ప్రశ్నించారు. కావున విభజన హామీల్లో భాగంగా ఉన్నటువంటి కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు