/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/virat-1-jpg.webp)
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఇంగ్లండ్ సిరీస్ కు దూరంగా ఉన్నారు. ఈమధ్యే ఆయన భార్య అనుష్క శర్మ అకాయ్ కు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. దీంతో తన అభిమానుల కోసం ఈ సంతోషకరమైన వార్తను తెలియజేశారు. అయితే ఆ ఆనందంలో ఉన్న విరాట్ కోహ్లీ మరో ఘనతను అందుకున్నారు. సోషల్ మీడియా వేదికగా ఓ అరుదైన ఘనత తన ఖాతాలో వేసుకున్నాడు. ఇన్ స్టాగ్రామ్ లో ఈ పోస్టుతోపాటు తాను అప్ లోడ్ చేసిన మరో 6 పోస్టులకు గానూ ప్రతి పోస్టుకు దాదాపు 10 మిలియన్లకు పైగా లైక్స్ వచ్చాయి. ఇలా ఇన్ స్టాగ్రామ్ లో ఇలా ఆరు పోస్టులకు పది మిలియన్లకు పైగా లైకులు పొందిన తొలిభారతీయుడిగా కోహ్లీ హిస్టరీ క్రియేట్ చేశాడు.
Virat Kohli is the first Indian to have more than 10 million likes on Instagram for 6 posts. 🤯👌
- No Indian has for more than 1 post, the Brand of King. pic.twitter.com/pxhVt7n09v
— Johns. (@CricCrazyJohns) February 25, 2024
కాగా ఈ వరల్డ్‌కప్‌లో కోహ్లీ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. సింగిల్ ఎడిషన్‌లో 750కు పైగా పరుగులు చేశాడు. ప్రపంచంలో ఏ ప్లేయర్ కూడా వరల్డ్‌కప్ ఎడిషన్‌లో ఇన్ని పరుగులు చేయలేదు. 2003లో సచిన్ చేసిన 673 రన్సే అంతకముందువరకు టాప్. ఇక ఈ వరల్డ్‌కప్‌లోనే కోహ్లీ తన కెరీర్‌లో వన్డేల్లో 50వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అంతేకాదు మరెన్నో రికార్డులను కోహ్లీ ఈ వరల్డ్‌కప్‌లో తన ఖాతాలో వేసుకున్నాడు.
సింగిల్ ఎడిషన్ వరల్డ్‌కప్‌లో సెమీస్, ఫైనల్‌లో హాఫ్ సెంచరీ, సెంచరీ చేసిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. 1996 వరల్డ్‌కప్ సెమీస్‌లో అర్విందా డీ సెల్వా 66 రన్స్ చేయగా.. ఫైనల్‌లో 107 రన్స్ చేశాడు. ఇక 2015 ప్రపంచప్‌లో స్టీవ్ స్మిత్ సెమీస్‌లో సెంచరీ చేయగా.. ఫైనల్‌లో 56 రన్స్ చేశాడు. ఇక ఈ వరల్డ్‌కప్ సెమీస్‌లో న్యూజిలాండ్‌పై కోహ్లీ సెంచరి చేశాడు.. ఫైనల్‌లో 54 రన్స్ చేశాడు.