Breaking: స్టాఫ్ నర్స్ ఫలితాలు రిలీజ్..ఇలా చెక్ చేసుకోండి..!!

స్టాఫ్ నర్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫైనల్ మెరిట్ లిస్టును కాసేపటి క్రితం ప్రకటించారు. 7,094పోస్టుల్లో 6,956మందిని ఎంపిక చేసినట్లు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్ మెంట్ బోర్డు తెలిపింది.

Breaking: స్టాఫ్ నర్స్ ఫలితాలు రిలీజ్..ఇలా చెక్ చేసుకోండి..!!
New Update

స్టాఫ్ నర్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫైనల్ మెరిట్ లిస్టును కాసేపటి క్రితం ప్రకటించారు. 7,094పోస్టుల్లో 6,956మందిని ఎంపిక చేసినట్లు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్ మెంట్ బోర్డు తెలిపింది.

ఎట్టకేలకు స్టాఫ్ నర్సు ఉద్యోగాల ఫలితాలను ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఈ మేరకు మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్ మెంట్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు మహిళలకు హారిజంటల్ రోస్టర్ పద్దతిలో ఫలితాలను వెల్లడింనట్లు బోర్డు పేర్కొంది. మెరిట్ లిస్టు, వెయిటేజీ పాయింట్లు, ఒరిజినల్ సర్టిఫికెట్ల ధ్రువీకరణ ఆధారంగా, తొమ్మిది డిపార్ట్ మెంట్లలో స్టాఫ్ నర్సు పోస్టులకు 6,956 మందిని సెలక్ట్ చేసినట్లు వెల్లడించింది.

ఇది కూడా చదవండి: ఒక్కసారిగా మద్యం మానేస్తే ఏమవుతుందో తెలుసా?

వీరందరికి జనవరి 31వ తేదీని ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులమీదుగా నియామక పత్రాలను అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి దామోదర రాజనర్సింహ ఇతర అధికారులు హాజరు కానున్నారు. కొత్త ప్రభుత్వంలో చేయబోతున్న మొదటి ఉద్యోగాల భర్తీ కావడంతో పబ్లిసిటీ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇందులో భాగంగానే నియామక పత్రాలను సెలబ్రేషన్ రూపంలో అందజేయాలని నిర్ణయం తీసుకున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.

#staff-nurse-result-release
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe