Srirangam Venkataramana: మహాకవి శ్రీశ్రీ కుమారుడు శ్రీరంగం వెంకట రమణ (59) మరణించారు. అమెరికాలో నివాసం ఉంటున్న ఆయన గురువారం (జూన్ 7)న అక్కడే తుదిశ్వాస విడిచినట్టు గుంటూరులోని వారి కుటుంబ బంధువు డాక్టర్ రమణ యశస్వి ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మృతదేహానికి అక్కడే అంత్యక్రియలు జరిపినట్టు ఆయన వివరించారు.
శ్రీశ్రీ సతీమణి సరోజకు 80 ఏళ్ల వయసులో పుత్రవియోగం కలగడం పట్ల శ్రీశ్రీ అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. కాగా, శ్రీరంగం వెంకటరమణ అమెరికాలోని కనెక్టికల్ రాష్ట్రంలో నివాసం ఉంటున్నారు. ఫైజర్ కంపెనీ రీసెర్చ్ విభాగంలో పనిచేస్తున్న ఆయన పాతికేళ్ల క్రితమే అమెరికాలో స్థిరపడిపోయారు. ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య మాధవి పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలంలోని గణపవరం. వెంకట రమణ పిల్లలు శ్రీనివాసరావు, కవిత చదువుకుంటున్నారు.
శ్రీరంగం వెంకట రమణ(Srirangam Venkataramana) మరణం పట్ల సాహితీ వేత్తలు సంతాపం తెలిపారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్, కృష్ణా జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి జీవీ పూర్ణచందర్ తమ సానుభూతిని వ్యక్తం చేశారు.
Also Read: పచ్చళ్ల నుంచి మీడియా దాకా..రామోజీ విజయ ప్రస్థానం ఇదే