Ananthapuram: అనంతలో ఆందోళన.. రోడ్డెక్కిన శ్రీరామ వాటర్ ప్రాజెక్ట్ వర్కర్లు..!

ఉమ్మడి అనంతపురం జిల్లాలో శ్రీరామ వాటర్ ప్రాజెక్ట్ వర్కర్లు నిరసన చేస్తున్నారు. దాదాపు ఐదు నెలల నుండి తమకు జీతాలు చెల్లించడం లేదని ఆందోళన చేపట్టారు. వెంటనే ప్రభుత్వం వాటిని చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే నిరసన కార్యక్రమాలు మరింత ఉదృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.

New Update
Ananthapuram: అనంతలో ఆందోళన.. రోడ్డెక్కిన శ్రీరామ వాటర్ ప్రాజెక్ట్ వర్కర్లు..!

Ananthapuram: ఉమ్మడి అనంతపురం జిల్లాలో దాదాపు 2000 గ్రామాలకు మంచినీటి సరఫరా చేసే శ్రీరామ వాటర్ ప్రాజెక్ట్ వర్కర్లు ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. దాదాపు ఐదు నెలల నుండి తమకు జీతాలు చెల్లించడం లేదని ఆందోళన చేపట్టారు. తమ వేతనాలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే నిరసన కార్యక్రమాలు మరింత ఉదృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు నీటి యాజమాన్య కార్మికులు.

Also Read: కోడికత్తి శ్రీనుని ఎంతకాలం జైల్లో ఉంచుతారు?: మాజీ ఎంపీ హర్షకుమార్

గ్రామాల్లో నీటి పంపిణీ కార్యక్రమంలో ప్రముఖ పాత్ర పోషించే తమకు ప్రతిసారి నెలల తరబడి వేతనాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తుందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ న్యాయమైన కోరికలను నెరవేర్చాలని 18 రోజులుగా నిరసన కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: విశాఖలో నలుగురు వైసీపీ కార్పొరేటర్లను సస్పెండ్ చేసిన అధిష్టానం.. కారణం ఇదే..!

కార్మికులకు సంబంధం లేకుండా అధికారులే ఈ మధ్యకాలంలో వాటర్ సప్లై ని చేయడానికి ప్రయత్నించి.. ఎంత ఫ్లో పంపాలో తెలియక ప్రెషర్ ఎక్కువ కావడంతో పైప్లైన్లు పగిలిపోయాయని వెల్లడించారు. గ్రామాల్లో మా పరిస్థితులను ప్రజలు అర్థం చేసుకున్నారని కానీ ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడుతున్నారు. ఇప్పటికైనా తమ వేతనాలను ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటూ పూర్తిస్థాయిలో నిరసన కార్యక్రమాలు చేస్తామని తేల్చిచెబుతున్నారు.

Advertisment
తాజా కథనాలు