వేములవాడ రాజన్న భక్తులకు అలర్ట్.. కార్తీకమాసం సందర్భంగా అధికారుల కీలక ప్రకటన

వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి వచ్చే భక్తులకు ఆలయాధికారులు ఓ కీలక విషయాన్ని తెలిపారు. ఆది,సోమ వారాల్లో నిర్వహించే అభిషేకాలు, అన్నపూజాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

వేములవాడ రాజన్న భక్తులకు అలర్ట్.. కార్తీకమాసం సందర్భంగా అధికారుల కీలక ప్రకటన
New Update

ప్రముఖ పుణ్య క్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో వచ్చి స్వామి వారిని దర్శించుకుంటున్నారు. ఈ క్రమంలో ఆలయాధికారులు భక్తులకు ఓ ముఖ్య సూచన చేశారు. ఆది, సోమ వారాల్లో ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుండడంతో భక్తులు స్వామి వారికి నిర్వహించే అభిషేకం, అన్న పూజలను రద్దు చేస్తున్నట్లు తెలిపారు.

దీని గురించి ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్‌ స్పందించారు. నిత్యం శ్రీరాజరాజేశ్వరి స్వామి వారికి రుద్రాభిషేకం , అభిషేకాలు నిర్వహిస్తారు. ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు తీరాతాయని భక్తుల నమ్మకం. అలాగే నిత్యం మధ్యాహ్నం పూట అన్న పూజ కార్యక్రమాలు ఉంటాయి.

ఈ పూజా కార్యక్రమంలో మహా శివుని పై అన్నాన్ని ఉంచి పూజ చేస్తారు. అనంతరం చిన్నారులకు మొదటిసారిగా అన్నాన్ని స్వామి వారి వద్ద తినిపించడం జరుగుతుంది. అన్న పూజ నిర్వహించడం ద్వారా ధనధాన్యాలు లక్ష్మీ దేవి కటాక్షాలు ఉంటాయని అర్చక స్వాములు వెల్లడించారు .

ఇప్పుడు అభిషేకాలను, అన్నపూజలను రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రత్యేక పర్వదినాల సందర్భంగా నవంబర్‌ 23 నుంచి 27 వరకు ఉదయం 10 గంటల నుంచి ప్రధాన పరివార శివాలయాల్లో అన్నపూజలు నిర్వహిస్తామని ఈవో వివరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను చేసినట్లు ఈవో తెలిపారు.

Also read: అయ్యప్ప భక్తులకు గుడ్‌ న్యూస్‌..నవంబర్‌ 17 నుంచి తెరుచుకుంటున్న శబరిమల ఆలయం!

#vemulawada #rajanna-temple
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe