/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/jagan-6-1.jpg)
Speaker Ayyanna Patrudu: జగన్ గురించి తన దగ్గర మాట్లొడొద్దని ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సీరియస్ అయ్యారు. గతంలో సభను ఏ విధంగా నడిపారో చూశామన్నారు. జగన్ (YS Jagan) ప్రతిపక్ష నేత కాదని., సామాన్య ఎమ్మెల్యే అని వారికి కేటాయించాల్సిన సమయాన్ని మాత్రమే వారికిస్తామపి తెలిపారు. జగన్ మాటలు వింటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందన్నారు.
Also Read: పులివెందులలో జగన్.. కడప నుంచే యాక్షన్ ప్లాన్!
గతంలో మీడియాపై ఆంక్షలు పెట్టి అడ్డుకున్నారని.. ఆ ఆంక్షలు ఎత్తివేస్తూ తొలి సంతకం పెట్టానన్నారు. వాళ్ల లాగా తాము మీడియాపై ఆంక్షలు పెట్టమన్నారు. సభను గౌరవంగా నడపడానికి ప్రయత్నిస్తానని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. అసెంబ్లీలో 88 మంది కొత్త ఎమ్మెల్యేలు ఉన్నారని.. వారికి ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందని వెల్లడించారు.
 Follow Us
 Follow Us